Home Ministry Alerts The States for Third Wave: అన్‌లాక్ పేరుతో ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా థర్డ్‌వేవ్ ప్రమాదం పొంచి ఉందని కేంద్రం రాష్ట్రాలను హెచ్చరించింది. టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్‌మెంట్ , వ్యాక్సినేషన్ నిరంతరం కొనసాగాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలను జారీ చేసింది.
లాక్‌డౌన్ సడలింపులు ఇస్తున్న రాష్ట్రాలు చాలా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర హోంశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోన్న వేళ.. నిబంధనల విషయంలో సంతృప్తిపడొద్దని హెచ్చరించింది. ఈ మేరకు పలు సూచనలు చేస్తూ కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా రాష్ట్రాలకు లేఖ రాశారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించుకొని కరోనా ఆంక్షల విధించడం లేక సడలించడంపై నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతుండటంతో పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఆంక్షలను సడలిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షించి ఆంక్షల విషయంలో నిర్ణయం తీసుకోవాలని, కరోనా ఉద్ధృతిని నిశితంగా గమనించి, కార్యకలాపాలను జాగ్రత్తగా పునఃప్రారంభించాలని కేంద్రం కోరింది. కరోనా నియంత్రణకు టెస్టింగ్, ట్రాకింగ్, వైద్యసేవలు, టీకాలు, నిరంతర నిఘా లాంటి రూల్స్ తప్పక పాటించాలని కేంద్రం కోరింది. కొన్ని రాష్ట్రాల్లో ఆంక్షల సడలింపులు మార్కెట్లను రద్దీగా మారుస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. కేసులు తగ్గుతున్న వేళ, నిర్లక్ష్యం తగదని కేంద్రం సూచించింది.
సెకండ్‌వేవ్‌తో వణికిపోయిన దేశ రాజధాని ఢిల్లీలో అన్‌లాక్ ప్రక్రియ ప్రారంభమైంది. దీంతో మార్కెట్లు, షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్ల వద్ద రద్దీ పెరిగింది. వేలాది మంది ఒకేదగ్గరికి చేరడమే కాకుండా, నిబంధనలను మరిచిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తీరుపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై రద్దీ పెరగడంపై ఢిల్లీ హైకోర్టు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏమాత్రం పొరపాటు చేసిన థర్డ్‌వేవ్ ప్రమాదం పొంచి ఉందని కేంద్రం రాష్ట్రాలకు హెచ్చరించింది
MHA issues advisory to all States to follow the fivefold strategy of #COVIDAppropriateBehaviour, test-track-treat, and vaccination.
All States/UTs should step up the pace of vaccination, to cover the maximum number of people in an expeditious manner.#LargestVaccineDrive pic.twitter.com/48kcitbMBp
— PIB India (@PIB_India) June 19, 2021
అలాగే, కేసులు పెరుగుతూ, పాజిటివిటీ రేటు అధికంగా నమోదవుతున్న ప్రాంతాల్లో ఆరోగ్యశాఖ సూచించిన కట్టడి చర్యలను అమలు చేయాలని పేర్కొంది. సంబంధిత అధికారులను సమన్వయం చేస్తూ ముందుకెళ్లాలని చెప్పింది. సెకండ్‌వేవ్‌తో వణికిపోయిన దిల్లీలో అన్‌లాక్ ప్రక్రియ స్టార్ట్ అయింది. మార్కెట్లు, షాపింగ్ మాల్స్, మెట్రో స్టేషన్ల వద్ద రద్దీ పెరిగింది. వేల మంది ఒకేదగ్గరికి చేరడమే కాకుండా, రూల్స్ మరిచిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ఈ తీరుపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై రద్దీ పెరగడంపై ఢిల్లీ హైకోర్టు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. అన్‌లాక్ పేరుతో ప్రజలు విచ్చలవిడిగా తిరిగితే థర్డ్ వేవ్ విరుచుకుపడడం ఖాయమని హెచ్చరించారు ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా. కరోనా కాలంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పకనే చెప్తున్నారాయన. దేశవ్యాప్తంగా అన్‌లాక్ మొదలయ్యాక ప్రజల్లో కోవిడ్ జాగ్రత్తలు కనిపించడం లేదంటున్న గులేరియా మన జాగ్రత్తలే మనకు రక్ష అంటున్నారు.
भारत में जल्द दस्तक दे सकती है कोरोना की तीसरी लहर! एम्स के प्रमुख ने बताया कब आएगी #ThirdWave | #Covid19 | #AIIMS | #RandeepGuleriahttps://t.co/dcktRVqWRn
— TV9 Bharatvarsh (@TV9Bharatvarsh) June 19, 2021
Read Also…. TS Cabinet Meeting Live: తెలంగాణలో ఆంక్షల్లేవు.. అన్నీ ఓపెన్.. లాక్‌డౌన్ ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు