ప్రైవేట్ ఆస్పత్రులు ఓపీ సేవలు అందించాల్సిందే: కేంద్రం

ప్రైవేట్ ఆస్పత్రులు ఓపీ సేవలు అందించాల్సిందేనని కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సేవల బంద్‌తో రోగులు ఇబ్బంది పడుతుండటంతో.. ఓపీ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ..

ప్రైవేట్ ఆస్పత్రులు ఓపీ సేవలు అందించాల్సిందే: కేంద్రం

Edited By:

Updated on: Apr 30, 2020 | 3:14 PM

ప్రైవేట్ ఆస్పత్రులు ఓపీ సేవలు అందించాల్సిందేనని కేంద్రం ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అత్యవసర సేవల బంద్‌తో రోగులు ఇబ్బంది పడుతుండటంతో.. ఓపీ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ.. రాష్ట్రాలకు లేఖ రాసింది. దీంతో ఇప్పటివరకూ అత్యవసర వైద్య సేవలకు మాత్రమే పరిమితమైన ప్రైవేట్‌ హాస్పిటల్స్‌.. ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాల మేరకు అవుట్ పేషెంట్‌ సేవలు అందించడానికి సిద్ధమయ్యాయి. అయితే – ప్రైవేట్‌ హాస్పిటల్స్‌ ఓపీ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి? కరోనా వైరస్‌ ప్రబలుతున్న రోజుల్లో డాక్టర్లు, వైద్య సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలు ఏంటి? అన్నది కీలకంగా మారాయి. ఓపీ కోసం వచ్చే రోగులు సామాజికదూరాన్ని పాటించడానికి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారన్న దానిపై కూడా హాస్పిటల్‌ నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Read More: 

వెహికల్ ట్యాక్స్‌పై స్వల్ప ఊరటనిచ్చిన ఏపీ ప్రభుత్వం

మే 3 తరువాత పెళ్లి చేసుకునే వారికి ఈ రూల్స్ తప్పనిసరి

జర్నలిస్ట్‌కి కరోనా పాజిటివ్.. క్వారంటైన్‌కు నలుగురు మంత్రులు