తెలుగు రాష్ట్రాల కరోనా అప్‌డేట్స్ః ఏపీలో పెరుగుతోన్న కోవిడ్ కేసులు
ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 10,080 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,17,040 కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 97మంది మరణించగా.. మృతుల సంఖ్య 1,939కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,15 మంది కరోనాను జయించగా..
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తోంది. రోజురోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య ఉధృతంగా పెరిగిపోతూనే ఉంది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ముందుగా ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 10,080 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,17,040 కు చేరింది. అలాగే రాష్ట్రంలో కరోనా సోకి తాజాగా 97మంది మరణించగా.. మృతుల సంఖ్య 1,939కు చేరింది. గడిచిన 24 గంటల్లో 9,15 మంది కరోనాను జయించగా.. కోలుకున్న వారి సంఖ్య 1,29,615కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 24,24,393 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 85,486 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
జిల్లాల వారీగా చూస్తే.. అనంతపురంలో 976, చిత్తూరులో 963, గుంటూరులో 601, తూర్పు గోదావరిలో 1310, కడపలో 525, కృష్ణాలో 391, కర్నూలులో 1353, నెల్లూరులో 878, ప్రకాశంలో 512, శ్రీకాకుళంలో 442, విశాఖలో 998, విజయనగరంలో 450, పశ్చిమ గోదావరిలో 681 కేసులు నమోదయ్యాయి. అయితే ఇతర రాష్ట్రాల నుంచి, దేశాల నుంచి వచ్చిన వారిలో ఎలాంటి కొత్త కేసులు నమోదు కాలేదు.
ఇక తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో కొత్తగా 1982 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 79,495కి చేరింది. ఇందులో ఇప్పటివరకూ 55,999 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అలాగే ప్రస్తుతం 22,869 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
అటు గడిచిన 24 గంటల్లో కరోనాతో 12 మంది మరణించారు. దీనితో రాష్ట్రవ్యాప్తంగా మృతుల సంఖ్య 627కి చేరింది. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా గ్రేటర్ పరిధిలో 463 పాజిటివ్ కేసులు, మేడ్చల్‌లో 141, రంగారెడ్డిలో 139, కరీంనగర్‌లో 96, జోగులాంబ గద్వాలలో 93, జనగామలో 78, పెద్దపల్లిలో 71, వరంగల్ రూరల్‌లో 71, కామారెడ్డిలో 62, నల్గొండలో 59, నిజామాబాద్ లో 58, సిద్ధిపేటలో 55, కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
Read More:
విజయవాడ హోటల్ ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఆరా