Two More Coronaviruses: మనుషులకు పొంచి ఉన్న మరో ముప్పు.. మరో రెండు వైరస్‌లను గుర్తించిన సైంటిస్టులు..?

మనుషులకు సోకే ప్రమాదం ఉన్న మరో రెండురకాల కరోనావైరస్‌లను శాస్త్రవేత్తలు కొన్నేళ్ల కిందటే గుర్తించారని సైన్స్‌మాగ్‌.ఓఆర్‌జీ పత్రిక పేర్కొంది.

Two More Coronaviruses: మనుషులకు పొంచి ఉన్న మరో ముప్పు.. మరో రెండు వైరస్‌లను గుర్తించిన సైంటిస్టులు..?
Two More Coronaviruses Can Infect People
Follow us
Balaraju Goud

|

Updated on: May 21, 2021 | 7:03 PM

Two More Coronaviruses: కరోనా మహమ్మారి కంగారెత్తిస్తుంటే.. బ్లాక్‌ ఫంగస్‌ మరింత బెంబేలెత్తిస్తోంది. కేసుల సంఖ్య పెరుగుతుంటే.. మరణాల సంఖ్య అంతకుమించి అనేలా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వైద్య పరిశోధకులు మరో బాంబు పేల్చారు. మనుషులకు సోకే ప్రమాదం ఉన్న మరో రెండురకాల కరోనావైరస్‌లను శాస్త్రవేత్తలు కొన్నేళ్ల కిందటే గుర్తించారని సైన్స్‌మాగ్‌.ఓఆర్‌జీ పత్రిక పేర్కొంది. ఇందుకు సంబంధించి పూర్తి నివేదికను ప్రచురించింది.

కొన్నేళ్ల క్రితం మలేసియాలో ఎనిమిది మంది పిల్లలకు నిమోనియా సోకి ఆసుపత్రి పాలయ్యారు. వారిని పరిశీలించగా కుక్కల్లో కనిపించే ఒక రకమైన కరోనావైరస్‌ సోకినట్లు గుర్తించారు. ఇప్పటికే కరోనా కుటుంబ నుంచి ఏడురకాల వైరస్‌లు మనుషులకు సోకుతున్నాయి. వీటిలో సార్స్‌1, సార్స్‌2, మెర్స్‌ అత్యంత ప్రమాదకరమైనవి. మిగిలినవి స్వల్ప అనారోగ్యం కలిగిస్తాయని సైంటిస్టులు తెలిపినట్లు సైన్స్‌మాగ్ పేర్కొంది. దీనిపై ఐయోవా విశ్వవిద్యాలయం వైరాలజిస్టు స్టాన్లీ పెర్ల్‌మన్‌ మాట్లాడుతూ ‘‘మనం కరోనావైరస్‌లు ఒక జీవి నుంచి మరో జీవిలోకి మారటాన్ని మరింత ఎక్కువగా చూస్తుంటాం’’ అని పేర్కొన్నారు.

అయితే, వైద్యులు గతంలో కనుగొన్న రెండు కొత్త కరోనా వైరస్లు మనుషుల నుంచి మనుషులకు వ్యాపించగలవో లేదో వెల్లడించలేకపోయారన్నారు. మలేషియాలో కనుగొన్న కరోనావైరస్‌ జన్యుక్రమాన్ని ‘క్లినికల్‌ ఇన్‌ఫెక్షియస్‌ డిసీజెస్‌’ పత్రికలో ప్రచురించారు. వాటిలో ఒకటి పిల్లులకు, మరొకటి పందులకు గతంలో సోకినట్లు గుర్తించామని శాస్త్రవేత్తలు తెలిపినట్లు అందులో పేర్కొన్నారు.

ఇక, ఈ కొత్త కరోనావైరస్‌ సోకిన 8 మంది కూడా మలేషియాలోని సంప్రదాయ తెగకు చెందినవారే కావడం విశేషం. వారంతా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తారు. తరచుగా పెంపుడు, అడవి జంతువులతో దగ్గరగా మెలుగుతుంటారు. అలా జంతువుల్లోని వైరస్‌లకు సమీపంగా ఉండటంతో వారికి వ్యాపించి ఉండొచ్చని భావించారు. పైగా వారంతా పిల్లలే కావడం విశేషం. అందులో నలుగురు పసికందులు. అప్పట్లో 4 నుంచి 7 రోజుల పాటు ఆసుపత్రుల్లో చికిత్స పొంది అనంతరం అందరూ కోలుకొన్నారని సైన్స్‌మాగ్ వెల్లడించింది. వారంతా 2017–18 మధ్య కాలంలో 301 మంది న్యుమోనియాతో బాధపడుతూ చికిత్స తీసుకుని కోలుకున్నట్లు తెలిపింది.

సాధారణంగా భారీగా మనుషులు, ఇతర జీవులు కలిసి ఉండేచోట కొత్త వైరస్లు ప్రబలే అవకాశాలున్నాయని డ్యూక్‌ విశ్వవిద్యాలయానికి చెందిన గ్రెగరీ గ్రే పేర్కొన్నారు. ముఖ్యంగా జంతువుల మార్కెట్లు, ఫామ్‌లు వంటివి వీటికి కేంద్రాలుగా ఉంటాయన్నారు. వైరస్లు మనుషుల్లోకి ప్రవేశించేలా రూపాంతరం చెందడానికి కొన్నేళ్లు సమయం పడుతుందని ఆయన తెలిపారు. వాస్తవానికి ఇలాంటి వైరస్‌లు పిల్లి, పంది, కుక్క లేదా కొన్ని రకాల అడవి మాంసాహార జంతువుల నుంచి సోకవచ్చని ఇటలీలోని బారి విశ్వవిద్యాలయంలో పశువైద్య వైరాలజిస్ట్ విటో మార్టెల్లా చెప్పారు. వీటిపై ఇంకా ఖచ్చితమైన పరిశోధనలు జరగాల్సి ఉందన్నారు. తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్తో బాధపడుతున్న ఇటాలియన్ పిల్లల నుండి నిల్వ చేసిన మల నమూనాలను పరీక్షించాలని యోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

చాపెల్ హిల్, నార్త్ కరోలినా విశ్వవిద్యాలయంలోని వైరాలజిస్ట్ రాల్ఫ్ బారిక్, కొత్తగా కనుగొన్న ఆల్ఫా కరోనా వైరస్‌ పిల్లలు మాత్రమే అంటుకుంటుందని, పెద్దలకు కొంత రోగనిరోధక శక్తి ఉండటం వల్ల అంత త్వరగా సోకదని సూచిస్తున్నారు. అయితే, వీటికి సంబంధించి పూర్తి పరిశోధనలు కొనసాగుతున్నాయన్నారు.

Read Also… Dogs Sniffing Corona : కరోనా సోకిన వారిని పసిగడుతున్న శునకాలు..! సెకన్ల వ్యవధిలో ఫలితాలు తేల్చేస్తున్నాయి.. ఎక్కడో తెలుసా..?