కరోనాపై అవగాహన కోసం హిజ్రాల కోలాటం..!
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచ దేశాలను వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ బారినపడకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలే ముఖ్యం. ఈ విషయాన్ని వైద్య నిపుణులు పదేపదే చెబుతున్నారు. బయటకు వెళ్లే..

కరోనా మహమ్మారి యావత్ ప్రపంచ దేశాలను వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి వైరస్ బారినపడకుండా ఉండాలంటే ముందస్తు జాగ్రత్తలే ముఖ్యం. ఈ విషయాన్ని వైద్య నిపుణులు పదేపదే చెబుతున్నారు. బయటకు వెళ్లే సమయంలో ఖచ్చితంగా మాస్క్ ధరించడంతో పాటుగా.. సోషల్ డిస్టెన్స్ పాటించాలని.. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలని సూచిస్తున్నారు. అయితే మన దేశంలో మార్చి నుంచి ఈ వైరస్ విజృంభణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయినప్పటికీ.. ఇప్పటికీ ప్రజల్లో సరైన అవగాహన రావడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వాలు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాయి.
తాజాగా తమిళనాడులో ప్రజల్లో కరోనాపై అవగాహన వచ్చేందుకు హిజ్రాలు వారి వంతు కృషిగా ప్రయత్నిస్తున్నారు. చెన్నై నగరంలోని మురికివాడల్లో నివసిస్తున్న ప్రజలకు హిజ్రాలు అవగాహన కల్పిస్తున్నారు. అది కూడా జానపద నృత్యాలు చేస్తూ ప్రచారం చేపడుతున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#WATCH Members of the transgender community perform Kolattam folk dance in slum areas of Chennai, Tamil Nadu to raise awareness about COVID19. (23.07.20) pic.twitter.com/sxXW3sWA1R
— ANI (@ANI) July 23, 2020