Covid Vaccine: కరోనా సెకండ్ వేవ్ భారత దేశాన్ని అతలాకుతలం చేసేస్తోంది. రోజురోజుకీ పెరిగిపోతున్న కేసుల సంఖ్య భయాందోళనకు గురి చేస్తోంది. మే చివరి నాటికి కేసుల సంఖ్య ఇంకా పెరుగుతుందని నిపుణులు చెబుతోన్న లెక్కలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదిలా ఉంటే వ్యాక్సిన్ తీసుకున్న వారిలో కరోనా ప్రభావం తక్కువగా ఉందన్న ఒక్క వార్తే ఇప్పుడు అందరినీ ఊపిరి పీల్చుకునేలా చేస్తోంది. అయితే కొందరిలో వ్యాక్సిన్‌పై అనుమానాలున్న నేపథ్యంలో సెలబ్రిటీలు సైతం వ్యాక్సినేషన్‌పై అవగాహన కల్పిస్తున్నారు. తాము వ్యాక్సిన్ తీసుకున్న విషయాన్ని ప్రపంచంతో పంచుకుంటూ వ్యాక్సిన్‌పై అపోహలను తొలిగించే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఆదివారం వ్యాక్సిన్ తీసుకున్న మహేష్.. ట్వీట్ చేస్తూ.. “నేను కోవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నాను. దయచేసి మీరు కూడా వ్యాక్సినేషన్ చేయించుకోండి. కరోనా సెకండ్ వేవ్ అందరినీ చాలా బలంగా తాకుతోంది. దీనిని వ్యాక్సినేషన్‌తోనే అడ్డుకోగలం. 18 ఏళ్లు నిండి వ్యాక్సిన్ వేసుకోవడానికి అర్హత ఉన్న వారందరూ మే 1 నుంచి వ్యాక్సిన్ తీసుకోండి. అందరూ జాగ్రత్తగా ఉండండి” అంటూ రాసుకొచ్చారు మహేష్.
Done with my vaccination! Please get yours!! The COVID-19 second wave has hit everyone hard and getting vaccinated is the need of the hour. Those aged 18 years and above are eligible to get theirs from May 1st. #GetVaccinated. Stay safe everyone ?
— Mahesh Babu (@urstrulyMahesh) April 25, 2021
ఇదిలా ఉంటే మే 1 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా టీకా కోసం ముందుగా కొవిన్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. ఏప్రిల్ 28 నుంచి రిజిస్ట్రేషన్ మొదలవుతుంది. మొదటి డోస్ తీసుకున్న తర్వాత 29వ రోజు అదే కేంద్రంలో రెండవ డోస్ కోసం ఆటో మేటిక్ గా షెడ్యూల్ ఫిక్స్ అవుతుంది. ఒకవేళ యూజర్ మరొక నగరానికి మారినట్లయితే, ఆ నగరంలోని సమీప టీకా కేంద్రంలో తిరిగి షెడ్యూల్ చేసుకోవాలి.
Also Read: Viral News: ఆహారాన్ని లాగిస్తున్న సింహం.. ఇంతలో అనుకోని షాక్.. అసలు ఏం జరిగిందంటే.!
Oscar Awards 2021: అట్టహాసంగా ఆస్కార్ అవార్డ్స్ వేడుక.. ఉత్తమ చిత్రంగా నిలిచిన ‘నో మ్యాడ్ ల్యాండ్’..
మరో దేశం కూడా !ఇండియా నుంచి విమాన ప్రయాణాలను అనుమతించబోం, ఇటలీ ప్రకటన