అండ‌మాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. తీవ్ర ఆందోళ‌నలో ప్ర‌జ‌లు

ఇప్ప‌టికే కరోనా మ‌హ‌మ్మారి కారణంగా భ‌యంతో వ‌ణికిపోతున్న ప్ర‌జ‌ల‌ను ఈ భూకంపాలు మ‌రింత భ‌య‌పెడుతున్నాయి. దేశంలో రోజుకి ఏదో ఒక చోట భూమి కంపించ‌డం స‌ర్వ సాధార‌ణ‌మైపోతుంది. తాజాగా సోమ‌వారం తెల్ల‌వారు జామున 2 గంట‌ల ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవుల్లో..

అండ‌మాన్ నికోబార్ దీవుల్లో భూకంపం.. తీవ్ర ఆందోళ‌నలో ప్ర‌జ‌లు
Earthquake
Follow us

| Edited By:

Updated on: Jul 13, 2020 | 12:07 PM

ఇప్ప‌టికే కరోనా మ‌హ‌మ్మారి కారణంగా భ‌యంతో వ‌ణికిపోతున్న ప్ర‌జ‌ల‌ను ఈ భూకంపాలు మ‌రింత భ‌య‌పెడుతున్నాయి. దేశంలో రోజుకి ఏదో ఒక చోట భూమి కంపించ‌డం స‌ర్వ సాధార‌ణ‌మైపోతుంది. తాజాగా సోమ‌వారం తెల్ల‌వారు జామున 2 గంట‌ల ప్రాంతంలో అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం సంభ‌వించింది. డిజ్లీపూర్‌కు ఉత్త‌రాన 153 కిలో మీట‌ర్ల దూరంలో ఈ భూకంపం సంభ‌వించింది. దీని ప్ర‌భావం మాగ్నిట్యూడ్‌పై 4.3గా న‌మోద‌య్యింద‌ని నేష‌న్ సెంట‌ర్ ఫ‌ర్ సెస్మాల‌జీ అధికారులు వెల్ల‌డించారు. కాగా జూన్ 28న కూడా ఇదే ప్రాంతంలో భూమి కంపించింది. అయితే వ‌రుస భూ ప్ర‌కంప‌న‌ల‌తో అండమాన్ నికోబార్ దీవుల్లోని ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్నారు.

కాగా ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విపరీతంగా వ్యాపిస్తోన్న సంగతి తెలిసిందే కదా. దీంతో రోజురోజుకీ కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అలాగే మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా గడచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 228,637 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 551 మరణాలు సంభవించాయి. దీనితో మొత్తంగా దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,49,553కి చేరుకుంది. ఇందులో 2,92,258 యాక్టివ్ కేసులు ఉండగా.. 22,674 మంది కరోనాతో మరణించారు. అటు 5,34,621 మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.

Latest Articles