Covid-19 Vaccine: వేగంగా కరోనా వ్యాక్సినేషన్.. రాష్ట్రాల వద్ద 3 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు: కేంద్రం

|

Jun 21, 2021 | 12:55 AM

India Corona Vaccination: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కొన్ని రోజల క్రితం లక్షల్లో నమోదైన కేసులు కాస్త.. ఇప్పుడు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే.. కరోనా కట్టడికి

Covid-19 Vaccine: వేగంగా కరోనా వ్యాక్సినేషన్.. రాష్ట్రాల వద్ద 3 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు: కేంద్రం
Covid-19 Vaccine
Follow us on

India Corona Vaccination: దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. కొన్ని రోజల క్రితం లక్షల్లో నమోదైన కేసులు కాస్త.. ఇప్పుడు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. అయితే.. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందన్న నిపుణుల సూచనల మేరకు.. కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ ఉత్పత్తిని, వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే.. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలిచ్చింది. దీంతోపాటు రాష్ట్రాలకు కోవిడ్‌-19 వ్యాక్సిన్ డోసులను వేగంగా సరఫరా చేస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 3.06 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు అందుబాటులో ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. వచ్చే మూడురోజుల్లో మరో 24.53లక్షల వ్యాక్సిన్‌ డోసులను రాష్ట్రాలకు అందించనున్నట్లు వెల్లడించింది.

ఇప్పటివరకూ అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలకు 29.10కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను ఉచితంగా కేంద్రం అందించింది. కాగా, వీటిలో 26.04కోట్ల వ్యాక్సిన్‌ డోసులను ప్రజలకు అందించారు. 18 సంవత్సరాలు దాటిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ అందించనున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే తయారీ సంస్థల నుంచి కేంద్రం వ్యాక్సిన్‌ కొనుగోలు చేసి, రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేస్తోంది.

Also read:

CJI NV Ramana: తల్లితండ్రుల వలె ఆదరించారు.. తెలుగు రాష్ట్రాల పర్యటనపై భావోద్వేగానికి గురైన జస్టిస్ ఎన్‌వి రమణ

ఢిల్లీలో ఫేక్ బ్లాక్ ఫంగస్ ఇంజెక్షన్లు అమ్ముతున్న ఇద్దరు డాక్టర్ల అరెస్ట్…..బ్లాకులో అమ్ముతున్న ముఠాతో మిలాఖత్ !