Telangana Corona Updates: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. ఈ సారి జిల్లాల్లో అత్యధికంగా..

|

Jul 27, 2021 | 7:58 PM

Telangana Corona Updates: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజూవారీగా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతున్నాయి.

Telangana Corona Updates: తెలంగాణలో కొనసాగుతున్న కరోనా ఉధృతి.. ఈ సారి జిల్లాల్లో అత్యధికంగా..
Follow us on

Telangana Corona Updates: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రోజూవారీగా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా నమోదవుతున్నాయి. అయితే, గత రెండు రోజుల నుంచి నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో విచిత్ర ధోరణి కనిపిస్తోంది. ఇప్పటి వరకు రాజధాని హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా కేసులు నమోదు అవుతుండగా.. ఇప్పుడు దానికి రివర్స్ జరుగుతోంది. జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. గడిచిన రెండు రోజులు జీహెచ్ఎంసీని మించి ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో అధిక పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన కరోనా బులెటిన్ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 1,23,166 సాంపిల్స్ పరీక్షించగా.. వీటిలో 645 పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజాగా నమోదైన కేసులతో కలిపి రాష్ట్ర ఇప్పటి వరకు 6,42,436 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక 729 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా కోలుకున్న వారి సంఖ్యతో కలిపి ఇప్పటి వరకు 6,29,408 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. కాగా, కరోనా వైరస్ ప్రభావంతో ఒక్క రోజులో నలుగురు మృత్యువాత పడ్డారు. మొత్తంగా చూసుకుంటే కరోనా కారణంగా చనిపోయిన వారి సంఖ్య 3,791కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 9,237 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. వీరిలో చాలా మంది హోమ్ ఐసోలేషన్‌లోనే చికిత్స పొందుతుండగా.. సీరియస్‌గా ఉన్న వారు మాత్రమే ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 97.97 శాతం రికవరీ రేటు ఉండగా.. మరణాల రేటు 0.59 శాతంగా ఉంది.

ఇక జిల్లాల వారీగా చూసుకుంటే అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 72 పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా.. ఖమ్మం జిల్లాలోనూ అంతే స్థాయిలో 72 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఆ తరువాత అత్యధికంగా కరీంనగర్ జిల్లాలో 58 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

Also read:

AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావు ఇష్యూపై మరో కీలక నిర్ణయం తీసుకున్న ఆంధ్రప్రదేశ్ సర్కార్..

Amy Jackson: అమీ జాక్సన్ చేసిన పనికి అభిమానులు షాక్.. అసలేం జరిగిందంటూ ఆరా..

Raj Kundra Case: టార్గెట్ రూ.34 కోట్లు.. రాజ్ కుంద్రా పోర్న్ బిజినెస్ ప్లాన్స్..సంచలన విషయాలు