TS New Year Celebrations: ఓ వైపు మరికొన్ని రోజుల్లో 2021 ఏడాదికి గుడ్ బై చెప్పేసి.. కొత్త సంవత్సరం 2022 కు స్వాగతం చెప్పడానికి ప్రపంచ దేశాలు రెడీ అవుతున్నాయి. మరోవైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తూ.. ప్రంపంచదేశాలను వణికిస్తోంది. ఇప్పటికే భారత్‌లో అడుగు పెట్టిన ఒమిక్రాన్ తెలంగాణలోనూ వెలుగు చూసింది. విదేశాల నుంచి వచ్చినవారిలో పలువురికి ఒమిక్రాన్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఓవైపు డెల్టా వేరియంట్ కేసులు … మరోవైపు ఒమిక్రాన్ కేసుల నమోదుతో ప్రజల్లో భయబ్రాంతులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ హైకోర్టు ముఖ్యమైన ఆదేశాలను జారీ చేసింది. ఒమిక్రాన్ కట్టడికి కోసం క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలను విధించాలని తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. వివరాల్లోకి వెళ్తే..
తెలంగాణలోనూ ఒమిక్రాన్ దడ పుట్టిస్తోంది. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కొత్తగా మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.. దీంతో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 38కి చేరింది. దీంతో కోవిడ్ పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టిన హై కోర్టు ఒమిక్రాన్ వైరస్ తీవ్రత దృష్టిలో పెట్టుకుని తెలంగాణ వ్యాప్తంగా క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించింది. జనం గుంపులు గుంపులుగా గుమికూడకుండా ఆదేశాలు జారీ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఇప్పటికే కర్ణాకట, ఢిల్లీ , మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు న్యూ ఇయర్ వేడుకలపై కీలక నిర్ణయం తీసుకుంది. న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించింన సంగతి తేలిసిందే. ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తిని దృష్టిలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను పై కోవిడ్ నిబంధనలను విధించారో.. అదే రీతిలో తెలంగాణ ప్రభుత్వం కూడా ఆదేశాలు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది.
Also Read: తనకు ఇద్దరూ కూతుర్లే.. ఇప్పుడు పుష్పరాజ్ వంటి కొడుకు కావాలంటున్న కల్పలత.