కొన్ని పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి.. సౌత్‌ఇండియాలో మనమే భేష్‌..

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శుక్రవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మైగ్రేంట్స్‌కి ఎక్కువగా కరోనా కేసులు వచ్చాయని తెలిపారు.

కొన్ని పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయి.. సౌత్‌ఇండియాలో మనమే భేష్‌..
Follow us

| Edited By:

Updated on: Jun 05, 2020 | 7:36 PM

తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ శుక్రవారం నాడు ప్రెస్ మీట్ నిర్వహించారు. కరోనా కేసుల గురించి మాట్లాడుతూ.. మైగ్రేంట్స్‌కి ఎక్కువగా కరోనా కేసులు వచ్చాయని తెలిపారు. కొన్ని రాజకీయ పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని.. వారికి నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే.. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలని.. అలా కాకుండా లేనిపోని ఆరోపణలు చేస్తూ.. ప్రభుత్వం పనిచేసుకోకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు సామాజిక మాధ్యమాల్లో బేస్‌లెస్ ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గాంధీ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశారు. వైద్య సిబ్బంది అందరికీ నాణ్యమైన ఎక్విప్మెంట్స్‌ను ఇస్తున్నామని.. ప్రస్తుతం పీపీఈ కిట్లు 10లక్షలకు పైగా తమ దగ్గర ఉన్నాయని పేర్కొన్నారు. వైద్యులు వారి ప్రాణాలను ఫణంగా పెట్టి రోగులకు చికిత్స అందిస్తున్నారని కొనియాడారు. గాంధీలో ప్లాస్మాథెరపీ విజయవంతం చేశామని.. ప్రస్తుతం 150 వెంటిలేటర్స్‌ కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. పరీక్షల నిర్వహణ సామర్థ్యం పెంచుతున్నామని.. ఎంత మందికి కరోనా వచ్చినా వైద్యం అందించేందుకు రెడీగా ఉన్నామని స్పష్టం చేశారు. దక్షిణ భారతంలోనే మనమే భేష్‌ అని సెంట్రల్ కమిటీనే చెప్పిందని.. వైద్య సిబ్బంది నియామకానికి కూడా నోటిఫికేషన్ వేశామని తెలిపారు. 3వేల మంది వైద్యులు, వైద్య సిబ్బందిని రిక్రూట్ చేసుకునేందుకు రెడీగా ఉన్నట్లు మంత్రి తెలిపారు.