ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా టెస్టుకు అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే కరోనా టెస్టుకు ధర కూడా నిర్ణయించింది. ఒక్కో కరోనా టెస్టుకు రూ.2,200గా నిర్ణయించింది. ఐసీఎంఆర్ మార్గదర్శకాలు ప్రకారం కోవిడ్ టెస్టులు చేయాలని మంత్రి ఈటెల రాజెందర్ సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లక్షణాలు ఉన్నవారికి మాత్రమే కరోనా టెస్టులు చేయాలి. కరోనా సోకపోతే హోం ఐసోలేషన్‌లో ఉండాలని పేర్కొన్నారు. అలాగే ప్రైవేటు హాస్పిటల్‌లో కరోనా పేషెంట్ల చికిత్సకి ఎంత వసూలు చేయాలనే విషయాన్ని కూడా వెల్లడించారు మంత్రి.
కరోనా లక్షణాలు ఉండి పాజిటివ్ సోకితే.. రోజుకు రూ.4 వేలు వసూలు చేయాలన్నారు. వెంటిలేటర్ లేకుండా ఐసీయూలో చికిత్స పాందితే రోజుకు రూ.7,500, వెంటిలేటర్ మీద చికిత్స చేస్తే రూ.9 వేల చొప్పున ఛార్జీలు వసూలు చేయాలన్నారు. వెంటిలేటర్, ఐసీయూలో ఉన్న సమయంలో యాంటీ వైరల్ డ్రగ్‌కు అదనపు ఛార్జీ వసూలు చేయవచ్చన్నారు. కరోనా పరీక్షలు చికిత్సను వ్యాపారం చేస్తే కటిన చర్యలు తీసుకుంటాం. ఆస్పత్రి సీజ్ చేస్తాం. ప్రభుత్వం చికిత్స చేయడానికి సిద్దంగా ఉంది. కావాలి అనుకున్న వారు ప్రైవేట్ ఆస్పత్రిలో కూడా చేసుకోవచ్చన్నారు.
కంటైన్మెంట్ పదానికి అర్థం చెప్పింది తెలంగాణ రాష్ట్రం. లాక్ డౌన్ విజయవంతంగా అమలు చేయడం వల్ల తెలంగాణలో కామ్యూనిటీ స్ప్రెడ్ లేదు అని ఐసీఎంఆరే ప్రకటించిందన్నారు. శాస్త్రీయంగా, క్షేత్ర స్థాయి అనుభవాలతో పని చేస్తున్నాము. హైదరాబాద్ చుట్టూ కరోనా వ్యాప్తి తెలుసుకోవడానికి 30 నియోజకవర్గాల్లో పరీక్షలు చేస్తున్నాం. హైదరాబాద్‌లో ప్రతి ఇంటినీ సర్వే చేస్తాము. దీనికోసం అదనంగా సిబ్బందిని తాత్కాలికంగా నియమించుకోవడానికి సీఎం కేసీఆర్ అనుమతి ఇచ్చారని తెలిపారు మంత్రి ఈటెల.
Read More:
బెజవాడ గ్యాంగ్ వార్ ఘటనపై పోలీసుల కఠిన నిర్ణయం.. వారందరికీ నగర బహిష్కరణ..