TS Covid-19: తెలంగాణలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా కేసులు.. గడిచిన 24గంటల్లో ఒకరు మృతి, కొత్త కేసులు ఎన్నంటే..?

|

Oct 01, 2021 | 7:58 PM

తెలంగాణలో కరోనాకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం.. ముమ్మరంగా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. కొత్త కేసుల విషయంలో బెడ్లు, ట్రీట్మెంట్ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

TS Covid-19: తెలంగాణలో స్థిరంగా కొనసాగుతున్న కరోనా కేసులు.. గడిచిన 24గంటల్లో ఒకరు మృతి, కొత్త కేసులు ఎన్నంటే..?
Telangana Corona
Follow us on

Telangana Coronavirus Cases: తెలంగాణలో కరోనాకు కళ్లెం వేసేందుకు ప్రభుత్వం.. ముమ్మరంగా చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసింది. కొత్త కేసుల విషయంలో బెడ్లు, ట్రీట్మెంట్ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టింది సర్కార్.

దీంతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా 46,193 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 220 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 6,66,183కు చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌ విడుదల చేసింది. కాగా, ఈ 24 గంటల వ్యవధిలో మరొకరు కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలను కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మృతి చెందిన వారి సంఖ్య 3,919కి చేరింది. ఇక, గడిచిన ఒక్కరోజు వ్యవధిలో 244 మంది కోలుకోవడం ద్వారా రాష్ట్రంలో కోలుకున్న వారి సంఖ్య 6,57,665కి చేరింది. మరోవైపు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 4,599 యాక్టివ్‌ కేసులున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇక, ఇప్పటి వరకు 2,64,25,728 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.

ఇవాళ జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు ఇలా ఉన్నాయి..

Ts Corona

Read Also… Mutual Funds: నెలనెలా కొంత పొదుపు చేయండి.. పదేళ్లలో లక్షల్లో ఆదాయం పొందండి..