TS Corona: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. పెరుగుతున్న కోలుకున్న వారి సంఖ్య

తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో భారీగా పాజిటివ్ కేసులు తగ్గాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కొత్తగా 231 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

TS Corona:  తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా పాజిటివ్ కేసులు.. పెరుగుతున్న కోలుకున్న వారి సంఖ్య

Updated on: Aug 22, 2021 | 8:11 PM

Telangana Coronavirus Cases Today: తెలంగాణలో కరోనా మహమ్మారి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో భారీగా పాజిటివ్ కేసులు తగ్గాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ కొత్తగా 231 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. కాగా, ఒక్కరోజులో కరోనా వైరస్‌ బారినపడిన బాధితుల్లో 453 మంది బాధితలు కోలుకున్నారు. ఇక, 24 గంటల వ్యవధిలో వైరస్‌ ధాటికి మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 6,384 యాక్టివ్‌ కేసులున్నాయి.

ఇక, ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 6,54,989 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, ఇవాళ్టి వరకు మొత్తం 6,44,747 మంది కరోనా మహమ్మారిని జయించి కోలుకున్నారు. మరోవైపు, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 3,858కు చేరినట్లు వైద్య ఆరోగ్యశాఖ నివేదినలో వెల్లడించింది. ఇవాళ మొత్తం 46,987 మంది కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు పేర్కొంది.

ఇక, జిల్లా వారీగా కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి…

Read Also… Taliban Promises: మీకేంకాదు.. మేమున్నాం.. క్రికెట్ జట్టుకు భరోసా ఇచ్చిన తాలిబన్లు.. జట్టు సభ్యులతో స్పెషల్ మీటింగ్..