Telangana Corona Cases: తెలంగాణలో గతంలో కంటే తగ్గిన కోవిడ్ వ్యాప్తి.. గత 24 గంటల్లో..

తెలంగాణలో కోవిడ్(COVID-19)వ్యాప్తి కొనసాగుతోంది. కానీ గతంలో కంటే కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో..

Telangana Corona Cases: తెలంగాణలో గతంలో కంటే తగ్గిన కోవిడ్ వ్యాప్తి.. గత 24 గంటల్లో..

Updated on: Feb 07, 2022 | 8:19 PM

Telangana Covid 19 Cases today updates: తెలంగాణలో కోవిడ్(COVID-19)వ్యాప్తి కొనసాగుతోంది. కానీ గతంలో కంటే కేసుల సంఖ్య రోజు రోజుకు తగ్గుతోంది. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1380 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. వైరస్ సోకి ఒక్కరు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కరోనా(CORONA) కేసుల సంఖ్య 7,78,910 కాగా, మరణాల సంఖ్య 4,101గా ఉంది. రాష్ట్రంలో రికవరీ కేసుల సంఖ్య 7,50,809 ఉండగా, తాజాగా 3877 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో రికవరీ రేటు 96.39 శాతం ఉంది. ఇక ఐసోలేషన్‌లో 24,000 మంది ఉన్నట్లు తెలంగా వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.

ఇక, ఇవాళ మొత్తం 68,720 శాంపిల్స్ పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఇప్పటివరకు తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటివరకు 3,26,55,095 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. మరోవైపు, ఇవాళ కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 350 మందికి మహమ్మారి సోకినట్లు తెలిపారు. తర్వాత స్థానాల్లో మేడ్చెల్ జిల్లా ఉంది. ఇక, మిగిలిన జిల్లాల్లో 100 లోపే కోవిడ్ కేసులు వెలుగు చూశాయి.

ఇవి కూడా చదవండి: Uniform Measurements: వివాదంగా మారిన మహిళా పోలీస్ యూనిఫామ్ కొలతల వ్యవహారం.. స్పందించిన నెల్లూరు జిల్లా ఎస్పీ..

CM KCR Yadadri visit: శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ్మ‌స్వామిని ద‌ర్శించుకున్న సీఎం కేసీఆర్.. ఏరియ‌ల్ వ్యూ ద్వారా ఆల‌య పరిశీలన..