తెలంగాణలో కరోనా తీవ్రత కొనసాగుతుంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 1,07,329 శాంపిల్స్ టెస్ట్ చేయగా 582 మందికి వైరస్ సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,47,811కి చేరింది. తాజాగా మరో ముగ్గురు వైరస్ కారణంగా ప్రాణాలు విడిచారు. దీంతో మృతుల సంఖ్య 3,817కు పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 8,744 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా రికవరీ రేటు 98.06 శాతం కాగా.. డెత్ రేటు 0.58 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. తాజాగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 83 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది.
ఏపీ కరోనా వివరాలు…
ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. కొత్తగా 24 గంటల వ్యవధిలో 82,297 నమూనాలను పరీక్షించగా 2,145 మందికి పాజిటివ్‌గా తేలింది. ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 19,76,141కి చేరింది. తాజాగా.. 24 మంది ప్రాణాలు కోల్పోగా మొత్తం మృతుల సంఖ్య 13,468కి పెరిగింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,302 యాక్టివ్ కేసులున్నాయి. బుధవారం 2,003 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు.
దేశంలో కరోనా వివరాలు…
దేశంలో కూడా కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 16,64,030 మందికి కరోనా టెస్టులు చేయగా.. 42,982 మందికి పాజిటివ్‌గా తేలింది. బుధవారం మరో 533 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.18 కోట్లకు చేరగా.. 4,26,290 మంది చనిపోయారని చేరుకున్నారని గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 4,11,076 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. తాజాగా 41,726 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మరోపక్క బుధవారం 37,55,115 మందికి వ్యాక్సిన్ అందించారు.
Also Read:న్యూసెన్స్ వ్యవహారంపై స్పందించిన నిహారిక భర్త చైతన్య.. పూర్తి క్లారిటీ ఇచ్చేశాడు