తెలంగాణలో కరోనా తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తుంది. కొత్తగా లక్షా 677 మందికి కరోనా పరీక్షలు చేయగా 2,982 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,74,026కి చేరింది. మరో 21 మంది కోవిడ్‌తో పోరాడలేక కన్నుమూశారు. ఫలితంగా మొత్తం మృతుల సంఖ్య 3,247కి చేరినట్లు తెలంగాణ వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. మరో 3,837 మంది బాధితులు వైరస్ మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 36,917 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీ పరిధిలో 436 కరోనా కేసులు నమోదు కాగా.. నల్గొండ జిల్లాలో 218, ఖమ్మం జిల్లాలో 215 కేసులు వెలుగుచూశాయి.
రాష్ట్రంలో లాక్‌డౌన్ కఠినంగా అమలవుతోంది. ప్రభుత్వం ఆదేశాలతో పోలీసు ఉన్నతాధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్‌లో సీపీ అంజనీకుమార్ మదీనాగూడ చెక్‌పోస్ట్‌ను పరిశీలించారు. ప్రజలు రూల్స్ పాటిస్తున్నారన్న అంజనీకుమార్… అతిక్రమిస్తున్నవారిపై కేసులు నమోదు చేస్తున్నామని చెప్పారు. నగరంలో 180చెక్‌పోస్టుల వద్ద పోలీసులు నిర్విరామంగా పనిచేస్తున్నారని తెలిపారు. లాక్‌డౌన్ కట్టుదిట్టంగా అమలుచేస్తున్నామన్న రాచకొండ సీపీ మహేశ్ భగవత్… ఇప్పటివరకూ నిబంధనలు అతిక్రమించిన వారిపై 56వేల 466 కేసులు నమోదు చేసినట్లు వివరించారు. కరోనా కట్టడికి ప్రజలంతా సహకరించాలని కోరారు. జిల్లా కేంద్రాలు ఇతర పట్టణాల్లోనూ లాక్‌డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. ఆసిఫాబాద్, ఆదిలాబాద్, సిరిసిల్ల సహా పలు చోట్ల అనవసరంగా రోడ్లపై తిరుగుతున్నవారిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించారు. మంచిర్యాలలోని వీధుల్లో అనవసరంగా తిరుగుతున్న ఆకతాయిలను అదుపులోకి తీసుకుని… వారికి కరోనా టెస్టులు చేశారు. రోడ్లపై తిరగకుండా కౌన్సెలింగ్ ఇచ్చారు.
లాక్‌డౌన్ కట్టుదిట్టంగానే అమలవుతున్నా… సడలింపుల సమయంలో పెద్దసంఖ్యలో జనం రోడ్లపైకి వస్తున్నారు. మార్కెట్లు, బ్యాంకులు, నిత్యావసర సరుకులు దుకాణాలు రద్దీగా మారుతున్నాయి.
బిర్యానీ ఆర్డర్ సరిగ్గా ఇవ్వలేదంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేసిన నెటిజన్.. మంత్రి రిప్లై భలే ఫన్నీ