AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా బాధితులకు..బాధ్య‌త‌గా, మాన‌వ‌త్వంతో చికిత్స అందించండి

రాష్ట్రంలో కరోనా మహమ్మారి జడలు విప్పుకుంటున్న కారణంగా ప్రజల్లో భయాందోళన నెలకొంది. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందంటూ..పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో గవర్నర్‌ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

కరోనా బాధితులకు..బాధ్య‌త‌గా, మాన‌వ‌త్వంతో చికిత్స అందించండి
Jyothi Gadda
|

Updated on: Jul 07, 2020 | 3:00 PM

Share

తెలంగాణలో కరోనా కల్లోలం సృస్టిస్తోంది. దేశంలోనే అత్యధిక పాజిటివ్ రేటింగ్‌తో రాష్ట్రం దూసుకుపోతోంది. ఇప్పటికే రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 300 దాటింది. సోమవారం కరోనాతో 11 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మొత్తం మరణించిన వారి సంఖ్య 306కు చేరింది. రాష్ట్రంలో 10,646 యాక్టివ్‌ కేసులున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రంలో కరోనా మహమ్మారి జడలు విప్పుకుంటున్న కారణంగా ప్రజల్లో భయాందోళన నెలకొంది. మరోవైపు ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిర్లక్ష్యం కనిపిస్తోందంటూ..పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటువంటి సమయంలో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో గవర్నర్‌ తమిళిసై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశం నిర్వహించారు.

గవర్నర్‌ తమిళిసై నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో 11 ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు పాల్గొన్నాయి. కాగా, గవర్నర్ వారికి పలు కీలక సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేట్ ఆసుపత్రులకు వచ్చే పాజిటివ్ రోగులకు భరోసా కల్పించే విధంగా చికిత్సలు అందించాలని ఈ సందర్భంగా గవర్నర్ వారికి సూచించారు. కరోనా కల్లోలంతో భయాందోళనలు పెరిగిపోతున్న దృష్ట్యా అనేక కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే రోగుల పట్ల బాధ్యతగా, మానవత్వంతో చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని యాజమాన్యాలకు సూచించారు.

కార్పొరేట్, ప్రైవేటు ఆస్పత్రుల్లో సరైన వైద్యం అంద‌టంలేదన్న ఫిర్యాదులను ప్రస్తావిస్తూ.. కార్పొరేట్ ఆస్పత్రులకు వచ్చే పాజిటివ్ రోగులకు భరోసా కల్పించాలన్నారు. పాజిటివ్ బాధితులు ఆస్పత్రికి రాగానే కచ్చితంగా చేర్చుకోవాలని, నాలుగైదు నాలుగైదు ఆస్పత్రులు తిరిగే పరిస్థితి రాకూడదని గవర్నర్ హెచ్చరించారు. అలాగే టెస్టులు బాధ్యతతో చేయాలని అవసరమైతే కార్పొరేట్ ఆస్పత్రులకు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీల సహకారం తీసుకోవాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పేషేంట్స్ నుండి అధిక చార్జీలు వసూలు చేయకూడదని గవర్నర్ తమిళ సై స్పష్టం చేశారు.

Follow Us
రూ. 13 వేల షాపింగ్‌తో దుబాయ్‌లో ఉచిత ఇల్లు.. స్కామ్ కాల్ అనుకుంటే
రూ. 13 వేల షాపింగ్‌తో దుబాయ్‌లో ఉచిత ఇల్లు.. స్కామ్ కాల్ అనుకుంటే
దుబాయ్‌లో క్షిపణి దాడి కలకలం.. కాసేపటికే..
దుబాయ్‌లో క్షిపణి దాడి కలకలం.. కాసేపటికే..
గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌కు బిగ్‌ షాకిచ్చిన అత్తాపూర్ పోలీసులు
గోల్డ్‌మ్యాన్ సూర్యాభాయ్‌కు బిగ్‌ షాకిచ్చిన అత్తాపూర్ పోలీసులు
అమెజాన్‌ నుంచి అతిపెద్ద సేల్‌ రాబోతోంది.. భారీ డిస్కౌంట్లు..
అమెజాన్‌ నుంచి అతిపెద్ద సేల్‌ రాబోతోంది.. భారీ డిస్కౌంట్లు..
పాస్‌పోర్ట్ చట్టం తెలుసుకో.. ఒవైసీపై కిషన్ రెడ్డి ఫైర్!
పాస్‌పోర్ట్ చట్టం తెలుసుకో.. ఒవైసీపై కిషన్ రెడ్డి ఫైర్!
సరిగ్గా అలారం పెట్టినట్టు రోజూ ఒకే టైంకి దంచికోడుతున్న వర్షం!
సరిగ్గా అలారం పెట్టినట్టు రోజూ ఒకే టైంకి దంచికోడుతున్న వర్షం!
చిన్నారుల ముక్కు, చెవుల్లో నూనె వేస్తున్నారా? డాక్టర్ల హెచ్చరిక!
చిన్నారుల ముక్కు, చెవుల్లో నూనె వేస్తున్నారా? డాక్టర్ల హెచ్చరిక!
జేసీబీ ఫుల్‌ఫాం ఏంటి? అది పసుపు రంగులోనే ఎందుకు ఉంటుంది?
జేసీబీ ఫుల్‌ఫాం ఏంటి? అది పసుపు రంగులోనే ఎందుకు ఉంటుంది?
మొబైల్ చూస్తూ టాయిలెట్ సీటుపై ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?
మొబైల్ చూస్తూ టాయిలెట్ సీటుపై ఎక్కువ సేపు కూర్చుంటున్నారా?
క్రూరత్వం పరాకాష్ఠ.. అంగన్‌వాడీ కేంద్రంలో అమానుషం..!
క్రూరత్వం పరాకాష్ఠ.. అంగన్‌వాడీ కేంద్రంలో అమానుషం..!