కరోనా భయంతో క్వారంటైన్‌లో ఆత్మహత్య చేసుకున్న వలస కూలీ..!

| Edited By:

May 05, 2020 | 1:44 PM

బతుకు తెరువు కోసం దుబాయ్‌కి వెళ్లిన ఓ వ్యక్తి క్వారంటైన్‌లో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా క్వారంటైన్‌లో ఉన్న ఆ వ్యక్తి కరోనా వచ్చిందన్న

కరోనా భయంతో క్వారంటైన్‌లో ఆత్మహత్య చేసుకున్న వలస కూలీ..!
Follow us on

బతుకు తెరువు కోసం దుబాయ్‌కి వెళ్లిన ఓ వ్యక్తి క్వారంటైన్‌లో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా క్వారంటైన్‌లో ఉన్న ఆ వ్యక్తి కరోనా వచ్చిందన్న భయంతో ఆత్మహత్య చేసుకొని తనువు చాలించినట్లు తెలుస్తోంది. అతడి స్నేహితుల వివరాల ప్రకారం.. ఇచ్ఛాపురం మండలం లొద్దపుట్టి నీలాద్రిపేటకు చెందిన పైలా పరశురామ్‌ రెడ్డి(47) పద్దెనిమిది ఏళ్ల క్రితం యూఏఈ వెళ్లాడు. అక్కడ  నేషనల్‌ పెట్రోలియం అండ్‌ కనస్ట్రక్షన్‌ కంపెనీలో అతడు పనిచేస్తున్నాడు.

ఈ ఏడాది జనవరిలో అతడు స్వగ్రామం రావాల్సి ఉంది. అయితే కరోనా వైరస్‌ అధికంగా ఉండటంతో పరశురామ్ రెడ్డికి వీసా దొరకలేదు. దానికి తోడు ఇటీవల కరోనా లక్షణాలు ఉన్నాయన్న అనుమానంతో అతడిని క్వారంటైన్ సెంటర్ కు తరలించారు. ఈ పరిణామాలపై మనస్తాపం చెందిన పరశురామ్‌ రెడ్డి సోమవారం క్వారంటైన్‌లోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది.  అయితే గుండెపోటుతో ఆయన మరణించినట్లు తమకు సమాచారం అందిందని బంధువులు చెబుతున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో ఆయనకు అక్కడే అంత్యక్రియలు జరపబోతున్నట్లు తెలుస్తోంది.

Read This Story Also: దేవరకొండకు పెరుగుతున్న మద్దతు.. చిరు మొదలు పలువురు సెలబ్రిటీల ట్వీట్లు..!