AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాక్‌డౌన్ 4.0: క్రీడాకారులకు భారీ ఊరట.. మరి ఐపీఎల్ సంగతేంటి.!

దేశంలో కరోనా వైరస్ తీవ్రత విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్‌ను ఈ నెలాఖరు దాకా పొడిగించింది. దీనితో పాటుగా ప్రజలకు వెసులుబాటు కల్పించేలా పలు సడలింపులను ఇచ్చింది. ఇందులో భాగంగా జారీ చేసిన కొత్త మార్గదర్శకాలతో క్రీడాకారులకు భారీ ఊరట లభించింది. రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు.. ఇకపై చక్కగా మైదానాల్లో ప్రాక్టీసు మొదలుపెట్టవచ్చు. లాక్ డౌన్ 4.0లో స్టేడియంలు, క్రీడా సముదాయాలను తెరుచుకోవచ్చునని.. కానీ ప్రేక్షకులకు మాత్రం అనుమతి లేదని కేంద్ర హోం […]

లాక్‌డౌన్ 4.0: క్రీడాకారులకు భారీ ఊరట.. మరి ఐపీఎల్ సంగతేంటి.!
Ravi Kiran
|

Updated on: May 18, 2020 | 7:57 PM

Share

దేశంలో కరోనా వైరస్ తీవ్రత విజృంభిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్‌ను ఈ నెలాఖరు దాకా పొడిగించింది. దీనితో పాటుగా ప్రజలకు వెసులుబాటు కల్పించేలా పలు సడలింపులను ఇచ్చింది. ఇందులో భాగంగా జారీ చేసిన కొత్త మార్గదర్శకాలతో క్రీడాకారులకు భారీ ఊరట లభించింది. రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన ఆటగాళ్లు.. ఇకపై చక్కగా మైదానాల్లో ప్రాక్టీసు మొదలుపెట్టవచ్చు.

లాక్ డౌన్ 4.0లో స్టేడియంలు, క్రీడా సముదాయాలను తెరుచుకోవచ్చునని.. కానీ ప్రేక్షకులకు మాత్రం అనుమతి లేదని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీనితో టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన వారికి ఇది పెద్ద ఊరటను ఇచ్చే అంశం అని చెప్పాలి. త్వరలోనే దేశవ్యాప్తంగా స్పోర్ట్స్ శిక్షణా శిబరాలన్నీ తెరుచుకోనుండగా.. ప్రభుత్వం నుంచి మరిన్ని మార్గదర్శకాలు వచ్చిన తర్వాతే క్రీడా సముదాయాలా లేక శిక్షణ కేంద్రాలను మాత్రమే తెరవాలా అనే విషయంపై క్లారిటీ వస్తుందని భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు నరీందర్ బాత్రా తెలిపాడు.

మరోవైపు ప్రేక్షకులు లేకుండా స్టేడియంలు తెరుచుకునేందుకు కేంద్రం ఛాన్స్ ఇవ్వడంతో.. వాయిదా పడిన ఐపీఎల్ మొదలయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే దేశంలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండటంతో బీసీసీఐ దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి. కాగా, ఇప్పటికే బోర్డు అభిమానులు లేకుండా అతి కొద్ది స్టేడియంలలో తక్కువ మ్యాచులతో ఐపీఎల్ 13ను నిర్వహించాలని గతంలోనే ఆలోచించింది. దానికి తగ్గట్టు ప్రణాళికలను కూడా సిద్ధం చేసింది.

Read More:

జగన్ సర్కార్ మరో సంచలనం.. వారికి ఖాతాల్లోకి నేరుగా రూ. 10 వేలు..

Breaking: ఏపీలో బస్సు సర్వీసులకు అనుమతి..

ఏపీ: ‘రైతు భరోసా’ డబ్బులు పడ్డాయో? లేదో? తెలుసుకోండిలా..

Follow Us
పైలట్లకు జీతం ఎంత ఉంటుంది..? వామ్మో.. ఎంతంటే..?
పైలట్లకు జీతం ఎంత ఉంటుంది..? వామ్మో.. ఎంతంటే..?
జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా?తింటే ఏమవుతుంది.. వైద్యుల సూచన
జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా?తింటే ఏమవుతుంది.. వైద్యుల సూచన
సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో..
సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో..
థియేటర్లలో తడబడింది.. ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది.!
థియేటర్లలో తడబడింది.. ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది.!
బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే ఎందుకు ఆగిపోతారు..?
బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే ఎందుకు ఆగిపోతారు..?
బ్యాటింగ్ ఓకే.. కానీ ఈ రెండు విభాగాల్లో టీమిండియా వీక్
బ్యాటింగ్ ఓకే.. కానీ ఈ రెండు విభాగాల్లో టీమిండియా వీక్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం
మౌనిక పుట్టిన రోజు.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్
మౌనిక పుట్టిన రోజు.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్
తాబేలు కీరింగ్‌లో తాళం చెవులు పెడుతున్నారా? శుభమా.. అశుభమా?
తాబేలు కీరింగ్‌లో తాళం చెవులు పెడుతున్నారా? శుభమా.. అశుభమా?
రూ.15 లక్షల ఆఫ్ఘన్ నీలి రాతితో భారీ శివలింగం.. భారత్‌లో తొలిసారి!
రూ.15 లక్షల ఆఫ్ఘన్ నీలి రాతితో భారీ శివలింగం.. భారత్‌లో తొలిసారి!