Sonu Sood Oxygen: ఆకాశనంటుతోన్న సోనూసూద్ ఔదార్యం.. కరోనా బాధితుడి ఇంటికి నేరుగా ఆక్సిజన్ యంత్రం..
Sonu Sood Oxygen: కరోనా కష్ట కాలంలో వలస కార్మికులకు సహాయం అందిస్తూ మొదలైన నటుడు సోనూసూద్ సేవ కార్యక్రామలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తూ...
Sonu Sood Oxygen: కరోనా కష్ట కాలంలో వలస కార్మికులకు సహాయం అందిస్తూ మొదలైన నటుడు సోనూసూద్ సేవ కార్యక్రామలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అడిగిన వారికి లేదనకుండా సహాయం చేస్తూ కలియుగ కర్ణుడిగా మారారు సోనూ. కరోనా తొలి వేవ్ సమయంలో ప్రజలను ఆర్థికం ఆదుకున్న సోనూసూద్ ఇప్పుడు వారి ప్రాణాలను కాపాడే బృహత్కర పాత్రను పోషిస్తున్నారు. సమయానికి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతోన్నవారికి అండగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కరోనా బాధితులకు నేరుగా ఇంటికే ఆక్సిజన్ యంత్రాలను పంపిస్తూ తన మంచి మనసు చాటుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఓ ఫోన్ నెంబర్‌ను ఏర్పాటు చేసిన సోనూ తన టీమ్ తరఫున ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ కరోనా బాధితుడి ఇంటికి నేరుగా ఆక్సిజన్ యంత్రాన్ని పంపారు. నల్లకుంటకు చెందిన రాఘవ శర్మ(75) ఇటీవల కరోనా బారిన పడి హోమ్ ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నాడు. రాఘవ శర్మలో ఆక్సిజన్ స్థాయిలు పడిపోగా సాయం చేయాలంటూ అతడి కుమారుడు లక్ష్మినారాయణ ట్విట్టర్ ద్వారా సోనూ సూద్‌ను కోరారు. దీనికి స్పందించిన సోనూసూద్ తన చారిటీ ఫౌండేషన్ ద్వారా ఏకంగా ఆక్సిజన్ యంత్రాన్ని ఇంటికి పంపించారు. గురువారం రాత్రి రాఘవకు ఆక్సిజన్ మిషన్ అందజేయడంతో ఆయన కుటుంబ సభ్యులు సోనూసూద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read: Telangana Lockdown : తెలంగాణలో ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి లాక్‌డౌన్ ఆంక్షలు మరింత కఠినంగా అమలు
India Vs England: ఐపీఎల్ కోసం టెస్ట్ సిరీస్ షెడ్యూల్ మారదు.. క్లారిటీ ఇచ్చిన ఈసీబీ..