ముంబై.. ఆసుపత్రిలో కరోనా మృతుల సమీపంలోనే…
ముంబైలోని ఓ ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందినవారి డెడ్ బాడీల పక్క బెడ్లపైనే చికిత్స పొందుతున్న రోగులు కూడా ఉండడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. మృత దేహాలను నల్లటి బ్యాగుల్లో చుట్టేసి ఉండగా ఆ పక్కనే ఇతర రోగులను వారి బంధువులు పరామర్శిస్తున్న దృశ్యాన్ని ఎవరో సెల్ ఫోన్ లో వీడియో తీశారు. నగర మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఆసుపత్రిని నిర్వహిస్తోంది. ముంబైలో కోవిడ్ రోగులకు చికిత్సలందిస్తున్న పెద్ద హాస్పిటల్స్ లో ఇది కూడా ఒకటి. ఈ వార్డులో […]

ముంబైలోని ఓ ఆసుపత్రిలో కరోనాతో మృతి చెందినవారి డెడ్ బాడీల పక్క బెడ్లపైనే చికిత్స పొందుతున్న రోగులు కూడా ఉండడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. మృత దేహాలను నల్లటి బ్యాగుల్లో చుట్టేసి ఉండగా ఆ పక్కనే ఇతర రోగులను వారి బంధువులు పరామర్శిస్తున్న దృశ్యాన్ని ఎవరో సెల్ ఫోన్ లో వీడియో తీశారు. నగర మున్సిపల్ కార్పొరేషన్ ఈ ఆసుపత్రిని నిర్వహిస్తోంది. ముంబైలో కోవిడ్ రోగులకు చికిత్సలందిస్తున్న పెద్ద హాస్పిటల్స్ లో ఇది కూడా ఒకటి. ఈ వార్డులో కనీసం ఏడు మృత దేహాలను ఉంచారు. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే నితీష్ రాణే ఈ వీడియోను పోస్ట్ చేస్తూ.. ఇంతకన్నా అమానుషం ఎక్కడైనా ఉందా.. షేమ్ ఫుల్ అని ట్వీట్ చేశారు. ఈ రాష్ట్ర కాంగ్రెస్ నేత మిలింద్ దేవర కూడా ఆయనతో ఏకీభవించారు. ఆ మృత దేహాలను మార్చ్యురీకి ఎందుకు తరలించలేదని ప్రశ్నించగా.. ఇంగ్లే అనే డాక్టర్.. మార్చ్యురీలో 15 స్లాట్స్ ఉన్నాయని, వాటిలో ఇప్పటికే 11 భర్తీ అయిపోయాయని,. ఈ డెడ్ బాడీలను కూడా తరలిస్తే ప్రాబ్లమ్ వస్తుందని అన్నారు. బాడీ బ్యాగ్ లో ఒక డెడ్ బాడీని ఉంచాక అసలు ఇన్ఫెక్షన్ సమస్య తలెత్తదన్నారు.
మహారాష్ట్రలో 16,800 కరోనా కేసులు నమోదు కాగా.. ఒక్క ముంబైలోనే 10,714 కేసులు నమోదయ్యాయి.400 మంది మృతి చెందారు.
In Sion hospital..patients r sleeping next to dead bodies!!! This is the extreme..what kind of administration is this! Very very shameful!! @mybmc pic.twitter.com/NZmuiUMfSW
— nitesh rane (@NiteshNRane) May 6, 2020