AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గుంపులుగా గబ్బిలాలు మృతి.. భయపడుతున్న ప్రజలు..

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ గుంపులు గుంపులుగా గబ్బిలాలు మృత్యువాతపడటం ప్రజల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మీరట్ శివారు గ్రామమైన మెహ్రోలీలోని నీటి గుంటలో ఏప్రిల్ 29న పదుల సంఖ్యలో గబ్బిలాల కళేబరాలు బయటపడ్డాయి. దీనితో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వీటి నుంచే వ్యాపించిందని వారు అనుకోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యే వెంటనే అటవీ శాఖ అధికారులు సమాచారాన్ని అందించారు. […]

గుంపులుగా గబ్బిలాలు మృతి.. భయపడుతున్న ప్రజలు..
Ravi Kiran
|

Updated on: May 08, 2020 | 9:40 AM

Share

దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ గుంపులు గుంపులుగా గబ్బిలాలు మృత్యువాతపడటం ప్రజల్లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. మీరట్ శివారు గ్రామమైన మెహ్రోలీలోని నీటి గుంటలో ఏప్రిల్ 29న పదుల సంఖ్యలో గబ్బిలాల కళేబరాలు బయటపడ్డాయి. దీనితో ఒక్కసారిగా గ్రామస్తులు ఉలిక్కిపడ్డారు. ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి వీటి నుంచే వ్యాపించిందని వారు అనుకోవడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యే వెంటనే అటవీ శాఖ అధికారులు సమాచారాన్ని అందించారు.

ఇక సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని గబ్బిలాల నమూనాలను బరేలిలోని ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్(ఐవీఆర్ఐ)కి పంపించారు. వాటి మీద ఐవీఆర్ఐ శాస్త్రవేత్తలు పరిశోధన జరిపి కరెంట్ షాక్ తగలడం వల్లే గబ్బిలాలు మరణించాయని ధృవీకరించారు. దీనిపై అటవీ శాఖ అధికారి అదితి శర్మ మాట్లాడుతూ.. మొదటిగా పండ్ల తోటలలో వెదజల్లిన రసాయనాల వల్ల గబ్బిలాలు చనిపోయినట్లు భావించామని.. కానీ ఎలక్ట్రిక్ షాక్ వల్లే ఈ ఘటన జరిగింది కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని అన్నారు. కానీ మెహ్రోలి గ్రామస్తులు మాత్రం ఆయన మాటలను ఖండిస్తూ గబ్బిలాల మృతదేహాలు లభ్యమైన ప్రాంతంలో ఎలాంటి కరెంట్ లైన్ లేదని అంటున్నారు. అంతేకాకుండా ఒకవేళ కరెంట్ షాక్ కారణంగానే అవి చనిపోతే.. అక్కడ ఉన్న మిగతా జంతువులు ఎందుకు చనిపోలేదని ప్రశ్నిస్తున్నారు. కాగా, కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న నేపధ్యంలో ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేయాలనీ గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Read This: మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఇకపై వాటికి చెక్ పడినట్లే!

Follow Us
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. పావులా వడ్డీకే లక్ష వరకు రుణాలు
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. పావులా వడ్డీకే లక్ష వరకు రుణాలు
ఇదే జరిగితే ఫైనల్ తేదీలో మార్పు.. ఈ ఐసీసీ రూల్‌తో పరేషానే..?
ఇదే జరిగితే ఫైనల్ తేదీలో మార్పు.. ఈ ఐసీసీ రూల్‌తో పరేషానే..?
సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన మంచు మనోజ్.. ఏం జరిగిందంటే?
సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన మంచు మనోజ్.. ఏం జరిగిందంటే?
సూర్య చంద్రుల కలయిక.. ఆ రాశులకు మహర్దశ.. సుడి తిరగడం పక్కా!
సూర్య చంద్రుల కలయిక.. ఆ రాశులకు మహర్దశ.. సుడి తిరగడం పక్కా!
సామాన్యుడికి గ్యాస్‌ ధరల షాక్..! ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా
సామాన్యుడికి గ్యాస్‌ ధరల షాక్..! ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా
ఫైనల్ కోసం కీలక మార్పులు.. ఎలాంటి పిచ్ వాడుతున్నారో తెలుసా?
ఫైనల్ కోసం కీలక మార్పులు.. ఎలాంటి పిచ్ వాడుతున్నారో తెలుసా?
జగన్నాథుని సేవలో నాగచైతన్య, శోభిత దంపతులు..
జగన్నాథుని సేవలో నాగచైతన్య, శోభిత దంపతులు..
సముద్రంలో రూ.2500 కోట్లు.. ఆందోళనలో ఏపీ, తెలంగాణ రైతులు..
సముద్రంలో రూ.2500 కోట్లు.. ఆందోళనలో ఏపీ, తెలంగాణ రైతులు..
డిజిటల్ పరికరాల వాడకం వ్యసనంగా మారితే ప్రాణాలకే ముప్పు!
డిజిటల్ పరికరాల వాడకం వ్యసనంగా మారితే ప్రాణాలకే ముప్పు!
థియేటర్లలో ఫ్లాప్.. OTTలో సూపర్ హిట్.. నెల రోజులుగా ట్రెండింగ్‌లో
థియేటర్లలో ఫ్లాప్.. OTTలో సూపర్ హిట్.. నెల రోజులుగా ట్రెండింగ్‌లో