Schools Shut: జనవరి 31 వరకు స్కూల్స్ క్లోజ్.. కీలక నిర్ణయం తీసుకున్న మహా సర్కార్..

|

Jan 04, 2022 | 8:29 AM

మహారాష్ట్రలో కరోనా కల్లోలం కంటిన్యూ అవుతోంది. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ముంబై మహానగరంలో..

Schools Shut: జనవరి 31 వరకు స్కూల్స్ క్లోజ్.. కీలక నిర్ణయం తీసుకున్న మహా సర్కార్..
Schools
Follow us on

COVID 19: కరోనాకు పగ్గాల్లేకుండా పోయాయి. సామాన్య జనం నుంచి ప్రజాప్రతినిధుల వరకూ ఎవరినీ వదలడం లేదు. మహారాష్ట్రలో ఏకంగా పదుల సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడడం కలకలం సృష్టిస్తోంది. మహారాష్ట్రలో కరోనా కల్లోలం కంటిన్యూ అవుతోంది. మొన్నటి వరకు తగ్గిన కరోనా కేసులు ఇప్పుడు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ముంబై మహానగరంలో ఈ కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసుల నేపథ్యంలో పాఠశాలను జనవరి 31వ తేదీ వరకు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది ఈ మున్సిపల్ కార్పొరేషన్.

ఒకటి నుంచి 9వ తరగతులకు మాత్రమే ఈ నియమ నిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అలాగే పదో తరగతి నుంచి 12వ తరగతి విద్యార్థులకు పాఠశాలలు కొనసాగుతాయని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది. అయితే కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ ఈ క్లాసులను నిర్వహించాలని స్పష్టం చేసింది. ముఖ్యంగా మాస్కులు, భౌతిక దూరం పాటించాలని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి: Singer Sunitha: వ్యవసాయమంటే ఇష్టమంటున్న సింగర్ సునీత.. అరటి తోటలో హడావిడి.. వీడియో వైరల్..

Silver Price Today: వెండి కొనుగోలుదారులకు గుడ్‌న్యూస్‌.. తగ్గిన సిల్వర్‌ ధర