AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉద్యోగులకు భారీ ఝలక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..

ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇంక్రిమెంట్ల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది వరకూ శాలరీ ఇంక్రిమెంట్ల పెంపు ఉండదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఒక ఆర్డర్ కూడా జారీ...

ఉద్యోగులకు భారీ ఝలక్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 16, 2020 | 12:03 PM

Share

ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇంక్రిమెంట్ల అంశంపై కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది వరకూ శాలరీ ఇంక్రిమెంట్ల పెంపు ఉండదని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ ఒక ఆర్డర్ కూడా జారీ చేసింది. దీంతో లక్షల మంది ఉద్యోగులపై ప్రభావం పడనుంది. కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

2019 టూ  2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉద్యోగుల వార్షిక పనితీరు అంచనా గడువును పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ఇదివరకే ప్రభుత్వం ఈ గడువును డిసెంబర్ 2020 వరకూ మాత్రమే పొగిడిగించింది. ఇప్పుడు వచ్చే ఏడాది మార్చి 31ను తాజా డెడ్‌లైన్‌గా నిర్ణయించింది. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇంక్రిమెంట్ కోసం మార్చి 31, 2021 వరకూ ఎదురు చూడాల్సి ఉంటుంది. ఈ పెంపుతో గ్రూప్ ఏ, గ్రూప్ బీ, గ్రూప్ సీ ఉద్యోగులపై ఈ ఎఫెక్ట్ పడనుంది.

కేంద్రం జూన్ 11న విడుదల చేసిన ఆర్డర్ ప్రకారం.. ప్రస్తుతమున్న కరోనా వైరస్ పరిస్థితుల నేపథ్యంలో.. మోదీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అయితే ఇప్పటికే ఇంక్రిమెంట్ల ప్రాసెస్ పూర్తి కావాల్సి ఉండగా.. మే చివరి వరకూ ఈ ప్రక్రియ పూర్తి కానుందని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది.

ఇక దేశంలో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తుంది. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 43 వేల మార్క్ ను దాటింది. నిన్న ఒక్కరోజే 380 మంది కరోనా బాధితులు మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటి వరకు దేశంలో కరోనాబారినపడి చనిపోయినవారి సంఖ్య 9,900కి చేరింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,667 కేసలుు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు 3,43,091లకు చేరాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,53,178 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి కోలుకొని వివిధ ఆస్పత్రుల నుంచి 1,80,013 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ అయినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.

Read More: 

వాహనదారులపై అధిక భారం.. చమురుధరలపై రూ.2 పెంపు..

నేడు, రేపు సీఎంలతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్..

ఏపీ ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ టైం టేబుల్ రిలీజ్..

పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రివ్యూ
పెళ్లాం కాదు.. భర్త ఊరెళితే.. 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' రివ్యూ
అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న డ్రమ్స్ ప్లేయర్ శివమణి..
అమీన్ పీర్ దర్గాను దర్శించుకున్న డ్రమ్స్ ప్లేయర్ శివమణి..
మద్యం ప్రియులకు మత్తెంకించే కాంబో..! ఇలా తాగితే కిక్కే కిక్కు
మద్యం ప్రియులకు మత్తెంకించే కాంబో..! ఇలా తాగితే కిక్కే కిక్కు
అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగాయా.. ప్రపంచంలో ఎక్కడో యుద్ధం ..
అక్కడ పిజ్జా ఆర్డర్లు పెరిగాయా.. ప్రపంచంలో ఎక్కడో యుద్ధం ..
జియోలో 36 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ వచ్చిందని మీకు తెలుసా?
జియోలో 36 రోజుల వ్యాలిడిటీతో కొత్త ప్లాన్‌ వచ్చిందని మీకు తెలుసా?
జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు
జూనియర్ బాక్సర్‌తో మేరీ కోమ్‌కు ఎఫైర్.. మాజీ భర్త సంచలన ఆరోపణలు
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. పాలిటెక్నిక్‌లో 9 కొత్త కోర్సులు!
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్
సందీప్‌ని గుర్తుచేసిన గీతూ...అంతకు మించి అంటున్న ఆడియన్స్
చికెన్‌లోని ఈ పార్ట్స్ యమ స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు
చికెన్‌లోని ఈ పార్ట్స్ యమ స్పెషల్.. తిన్నారంటే ఆ రోగాల మాటే ఉండదు
మురుగు కాలువను క్లీన్ చేస్తున్న కార్మికులు.. కాళ్ల కింద కనిపించిన
మురుగు కాలువను క్లీన్ చేస్తున్న కార్మికులు.. కాళ్ల కింద కనిపించిన