మద్యంతో కిక్కు.. తెలంగాణలో రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్మకాలు..

మద్యంతో కిక్కు.. తెలంగాణలో రికార్డు స్థాయిలో లిక్కర్ అమ్మకాలు..

లాక్ డౌన్ కారణంగా మద్యానికి దూరమైన మందుబాబులు లిక్కర్ దుకాణాలు తెరవగానే విపరీతంగా తాగేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో లిక్కర్‌ సేల్స్‌ బ్రహ్మండంగా ఉంటున్నాయి. ఈ వారం రోజుల్లోనే మద్యం అమ్మకాలు దాదాపుగా 902 కోట్లకు చేరుకున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఇప్పుడు మరింత రెట్టింపు అమ్మకాలు జరుగుతున్నాయి. మళ్లీ ఎక్కడ మద్యం షాపులు మూసేస్తారోనన్న బెంగ కావచ్చు.. లేదా మద్యం తాగని 45 రోజులది ఇప్పుడు తాగేస్తున్నారో తెలియదు గానీ లిక్కర్‌ సేల్స్‌ మాత్రం అమోఘంగా […]

Ravi Kiran

|

May 13, 2020 | 12:23 PM

లాక్ డౌన్ కారణంగా మద్యానికి దూరమైన మందుబాబులు లిక్కర్ దుకాణాలు తెరవగానే విపరీతంగా తాగేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో లిక్కర్‌ సేల్స్‌ బ్రహ్మండంగా ఉంటున్నాయి. ఈ వారం రోజుల్లోనే మద్యం అమ్మకాలు దాదాపుగా 902 కోట్లకు చేరుకున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఇప్పుడు మరింత రెట్టింపు అమ్మకాలు జరుగుతున్నాయి. మళ్లీ ఎక్కడ మద్యం షాపులు మూసేస్తారోనన్న బెంగ కావచ్చు.. లేదా మద్యం తాగని 45 రోజులది ఇప్పుడు తాగేస్తున్నారో తెలియదు గానీ లిక్కర్‌ సేల్స్‌ మాత్రం అమోఘంగా ఉన్నాయి. ఇక తెలంగాణలో ఎక్కువ మద్యం అమ్మకాలు గ్రేటర్ హైదరాబాద్‌లోనే జరుగుతున్నాయి. కరోనా కేసులు ఎక్కువైపోయి.. లిక్కర్ షాపులు ఎక్కడ మూసేస్తారోనన్న భయంతో జనాలు పెద్దమొత్తంలో లిక్కర్ బాటిల్స్ కొనేసి ఇంట్లో పెట్టుకుంటున్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 6వ తేదీ నుంచి మద్యం షాపులను ఓపెన్‌ చేసింది. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం అమ్మకాలు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. అంతేకాకుండా పదహారు శాతం రేట్లను కూడా పెంచింది. ఇక ఆ రోజు నుంచి మొదలు కొని నిన్న సాయంత్రం ఆరు గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 902 కోట్ల అమ్మకాలు జరిగాయట.! అంటే రోజుకు గరిష్టంగా 129 కోట్ల అమ్మకాలు జరిగాయన్న మాట. ఇక 8వ తేదీన ఏకంగా 190 కోట్ల రూపాయల సేల్స్‌ జరిగితే.. ఆదివారం మాత్రం కేవలం 37 కోట్ల రూపాయల మద్యమే అమ్ముడయ్యింది. కాగా, గతేడాది మేలో మొత్తం 1,847 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయని సమాచారం.

Read This: కిమ్ లైఫ్‌స్టైల్ గురించి తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే!

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu