AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

స్కూళ్లు రీ ఓపెన్.. కేంద్రం విధించే కఠినమైన రూల్స్ ఇవేనా?

భారత్‌లో ప్రస్తుతం పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 90 వేలు దాటాయి కరోనా కేసులు. మరికొద్ది రోజుల్లో లక్షకి చేరుతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో స్కూళ్లపై ఎక్కువగా ఒత్తిడి పడుతోంది. ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పదో తరగతి పరీక్షలను బంద్ చేసి.. విద్యార్థులను పాస్ చేయాలని విద్యాశాఖలకు ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో స్కూళ్లు ఎప్పుడు […]

స్కూళ్లు రీ ఓపెన్.. కేంద్రం విధించే కఠినమైన రూల్స్ ఇవేనా?
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: May 17, 2020 | 12:56 PM

Share

భారత్‌లో ప్రస్తుతం పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే దాదాపు 90 వేలు దాటాయి కరోనా కేసులు. మరికొద్ది రోజుల్లో లక్షకి చేరుతాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ క్రమంలో స్కూళ్లపై ఎక్కువగా ఒత్తిడి పడుతోంది. ఇప్పటికే టెన్త్, ఇంటర్ పరీక్షలు వాయిదా పడ్డాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అయితే పదో తరగతి పరీక్షలను బంద్ చేసి.. విద్యార్థులను పాస్ చేయాలని విద్యాశాఖలకు ఆదేశాలు జారీ చేశాయి. ఈ నేపథ్యంలో స్కూళ్లు ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారో తెలియదు. తెరిచాక ఎలా ఉంటున్నది అందర్నీ వేధిస్తున్న ప్రశ్న. ఒకవేళ ఓపెన్ చేసినా.. పేరెంట్స్ పిల్లల్ని స్కూళ్లకు పంపుతారో లేదో తెలీదు. అందులోనూ మన దేశంలో స్కూల్ క్లాస్ రూమ్స్ చిన్నవిగా ఉంటాయి.

ఈ సమస్యలన్నింటిపై కేంద్ర మానవ అభివృద్ధి శాఖ.. బోర్డులు, స్కూళ్లు, టీచర్ల సలహాలు, సూచనలూ తీసుకొని.. కాలేజీలు, స్కూళ్ల కోసం ప్రత్యేకంగా కొన్ని గైడ్ లైన్స్ రూపొందిస్తోంది. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం.. ఒకవేళ స్టూడెంట్స్ స్కూళ్లకి వస్తే సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు ధరించడం తప్పనిసరి. క్లాస్ రూమ్‌లో స్టూడెంట్స్ సంఖ్యను తగ్గించాలి. అలాగే కేంద్రం కొన్ని కఠినమైన రూల్స్ కూడా తీసుకొచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

1. స్కూళ్లు రీ ఓపెన్ చేసినా, ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించినా వారానికి ఆరు రోజుల రూల్ తప్పనిసరి అంటోంది కేంద్రం. అంటే టీచర్లు, స్టూడెంట్స్ వారానికి ఆరు రోజులూ స్కూల్‌కి రావాల్సిందే. 2. ఒకే క్లాస్‌ రూమ్‌లో 20 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉండరాదు 3. స్కూళ్లల్లో సోషల్ డిస్టెన్సింగ్, మాస్కులు, శానిటైజర్లు వాడటం తప్పనిసరి. వీటిని విద్యార్థులు పాటించకపోతే ఫైన్ విధించే అవకాశాలున్నాయి. 4. తల్లిదండ్రులే స్వయంగా స్కూళ్లకు పిల్లల్ని తీసుకొచ్చి దింపాలి 5. అలాగే ప్రతీ రోజూ స్కూళ్లలో శానిటైజ్ చేయాలి. లేకుంటే ఆ సంబంధిత స్కూళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం ఉంది 6. ఇక ముఖ్యమైన సమస్య ఏంటంటే.. స్టూడెంట్స్‌ ఒకొరికరిని ముట్టుకోకుండా చూడాల్సిన బాధ్యత టీచర్లదే 7. స్టూడెంట్స్ తినేటప్పుడు కూడా చేతులు శుభ్రం చేసుకునేలా చూడాలని పలు సూచనలు చేసింది కేంద్రం

Read More:

భార్య స్పైసీ వంట చెయ్యలేదని బాల్కనీ నుంచి దూకబోయిన భర్త..

గుడ్‌న్యూస్.. వారికి 3 నెలలు గ్యాస్ సిలిండర్ ఉచితం

ఆత్మ నిర్భర్ 5.0 కీలకాంశాలు.. ఇదే చివరి ప్రకటన.. !

ఏపీలో ప్రారంభం కానున్న సినిమా హాళ్లు, రెస్టారెంట్లు!

Follow Us