విషాదం.. కరోనా అనుమానంతో ఆత్మహత్య

హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకిందనే అనుమానంతో  ఓ వ్యక్తి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రామంతపూర్‌లోని శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అతని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కరోనా లేదని ఇటీవల రిపోర్ట్ వచ్చినా అతడు ప్రాణాలు తీసుకోవడం విషాదాన్ని నింపింది. వివ‌రాల్లోకి వెళితే… రామంతాపూర్‌లోని వీఎస్ అపార్ట్‌మెంట్‌లో నివ‌సిస్తున్న వాసిరాజు కృష్ణమూర్తి అనే 60 ఏళ్ల వ్య‌క్తి  కొన్ని […]

విషాదం.. కరోనా అనుమానంతో ఆత్మహత్య

Edited By:

Updated on: May 02, 2020 | 5:02 PM

హైదరాబాద్‌లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకిందనే అనుమానంతో  ఓ వ్యక్తి భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రామంతపూర్‌లోని శనివారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో అతని కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కరోనా లేదని ఇటీవల రిపోర్ట్ వచ్చినా అతడు ప్రాణాలు తీసుకోవడం విషాదాన్ని నింపింది. వివ‌రాల్లోకి వెళితే…
రామంతాపూర్‌లోని వీఎస్ అపార్ట్‌మెంట్‌లో నివ‌సిస్తున్న వాసిరాజు కృష్ణమూర్తి అనే 60 ఏళ్ల వ్య‌క్తి  కొన్ని రోజులుగా ఎసిడిటీ సమస్యతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో తరుచూ ఆయాసం రావడంతో అతడు కింగ్ కోఠి ఆస్పత్రికి వెళ్లాడు. తనకు కరోనా సోకిందేమోనని భయపడుతూ వైద్యులకు చెప్పాడు. దీంతో పరీక్షలు జరిపిన వైద్యులు అతనికి ఆ లక్షణాలు లేవని తేల్చారు. అయినా నొప్పి అలాగే ఉండటంతో అతనిలో అనుమానం మరింత పెరిగింది. త‌ర‌చూ ఆయాసం వ‌స్తుండ‌టం గ‌మ‌నించిన‌ కృష్ణమూర్తి కుటుంబీకులు అత‌న్ని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సిద్ధమౌతున్నారు. ఈ సమయంలోనే బాల్కనీ నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. కృష్ణ మూర్తి మృతితో కాల‌నీలో విషాదం నెల‌కొంది.