Covid 3rd Wave : మన పిల్లలను కాపాడేందుకు శిశు సంక్షేమ శాఖ కంచె వలె నిలబడాలని సత్యవతి రాథోడ్ పిలుపు.. ఈటలపై ఆగ్రహం

|

Jun 05, 2021 | 2:23 PM

మనం మన పిల్లలను కాపాడుకునేందుకు ఒక కంచె వలె నిలబడాలని మంత్రి సత్యవతి..

Covid 3rd Wave : మన పిల్లలను కాపాడేందుకు శిశు సంక్షేమ శాఖ  కంచె వలె నిలబడాలని సత్యవతి రాథోడ్ పిలుపు.. ఈటలపై ఆగ్రహం
Minister Satyavathi rathod
Follow us on

Minister Satyavathi Rathod : మూడో దశ కరోనా పిల్లలపై ఎక్కువ ప్రభావం చూపనున్నందున మనం మన పిల్లలను కాపాడుకునేందుకు ఒక కంచె వలె నిలబడాలని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు. ఈ మేరకు ఆమె, మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ అధికార్లకు పిలుపునిచ్చారు. బాలింతలు, గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి..”? అనే దానిపై నిపుణుల ద్వారా తల్లులకు కౌన్సెలింగ్ ఇవ్వాలని ఆమె ఆదేశించారు. “కరోనా 3వ దశ పిల్లలపై ప్రభావం – కట్టడికి సంసిద్ధత” పై అన్ని జిల్లాల అధికారులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, నిపుణులతో మహిళాభివృద్ది శిశు సంక్షేమ కమిషనరేట్ లో మంత్రి సత్యవతి రాథోడ్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. శాఖ కమిషనర్, ప్రత్యేక కార్యదర్శి దివ్య కూడా వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రితో పాటు పాల్గొన్నారు.

“తెలిసీ తెలియని మారుమూల పల్లెల్లో కొవిడ్ థర్డ్ వేవ్ గురించి అవగాహన కల్పించాలి. గర్భిణీ, బాలింతలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై అవగాహన కల్పించాలి. ఒకవేళ కొవిడ్ బారిన పడినా.. బయట పడే విధంగా సాయం అందించాలి.” అని మంత్రి సత్యవతి రాథోడ్ మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి సీఎం కేసీఆర్‌పై మాజీమంత్రి ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

ఆత్మ రక్షణ కోసమే ఈటల టీఆర్ఎస్‌కు రాజీనామా చేశారని విమర్శించారు. బీజేపీ కాళ్ల దగ్గర ఆత్మగౌరవాన్ని ఈటల తాకట్టు పెట్టారని విమర్శించారు. పార్టీకి, ప్రజలకు వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడం వల్లే ఈటలపై చర్యలు తీసుకున్నామని స్పష్టం చేసిన ఆమె, మంత్రి స్థాయికి ఈటల రావడానికి అవకాశం కల్పించింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.

Read also : Delhi Unlocking : దేశ రాజధాని హస్తినలో కరోనా అన్ లాక్ షురూ చేసిన సీఎం కేజ్రీవాల్.. షాపులు, ఆఫీస్‌లకు వెసులుబాట్లు ఇలా..