మరో కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్
భారత్‌లో కరోనా విలయం కొనసాగుతోంది. రోజు రోజుకు రికార్డుస్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. ప్రతి రోజూ దాదాపు లక్షకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ ప్రజలు బయటకు రాక తప్పని పరిస్థితి నెలకొంది.
భారత్‌లో కరోనా విలయం కొనసాగుతోంది. రోజు రోజుకు రికార్డుస్థాయిలో కరోనా కేసులు పెరుగుతూనే వున్నాయి. ప్రతి రోజూ దాదాపు లక్షకు చేరువలో పాజిటివ్ కేసులు నమోదుకావడం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ ప్రజలు బయటకు రాక తప్పని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే అనేక మంది ప్రముఖులు, ప్రజా ప్రతినిధులు వైరస్ బారినపడ్డారు. నిన్న కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా సోకగా.. తాజాగా కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌కు కరోనా నిర్ధారణ అయ్యింది. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు.
తాను నిన్న కరోనా పరీక్షలు చేయించుకున్నానని, ఫలితాల్లో పాజిటివ్‌గా వచ్చిందని ప్రకటించారు. ఈ మధ్యకాలంలో తనను కలిసినవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.
ఇకపోతే, ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు సుమారు ఏడుగురు కేంద్ర మంత్రులు, 20 మందికి పైగా మంది పార్లమెంటు సభ్యులు కరోనా వైరస్ బారిన పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ రావు కరోనాతో దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం చనిపోయిన విషయం తెలిసిందే.