కరోనా ఎఫెక్ట్: నెల్లూరులో మూతపడ్డ పోలీస్ స్టేషన్

నెల్లూరులోని వెంకటగిరి పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం సృష్టించింది. దాదాపు 11 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వెంకటగిరి సీఐతో పాటు ఎస్సైకి కూడా కరోనా వైరస్ సోకింది. వీరితో పాటు మరో ఏడు మంది కానిస్టేబుళ్లకి..

కరోనా ఎఫెక్ట్: నెల్లూరులో మూతపడ్డ పోలీస్ స్టేషన్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 05, 2020 | 11:13 AM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే కోవిడ్‌ కారణంగా పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్ కూడా అమలు పరుస్తోంది ఏపీ ప్రభుత్వం. అందులోనూ పలువురు ప్రజా ప్రతినిధులు, వైద్యులు, ప్రభుత్వ ఉద్యోగులు, పోలీసులపై కూడా ఈ వైరస్ ప్రభావం చూసిస్తోంది. తాజగా నెల్లూరులోని వెంకటగిరి పోలీస్ స్టేషన్‌లో కరోనా కలకలం సృష్టించింది. దాదాపు 11 మంది పోలీస్ సిబ్బందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వెంకటగిరి సీఐతో పాటు ఎస్సైకి కూడా కరోనా వైరస్ సోకింది. వీరితో పాటు మరో ఏడు మంది కానిస్టేబుళ్లకి, హోంగార్డులకి కూడా కోవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. పోలీస్ స్టేషన్‌లో పని చేసే మహిళా స్వీపర్లు, మర్డర్ కేసులో నిందితుల ద్వారా కరోనా సోకినట్లు సమాచారం. కాగా పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులకు కూడా వైద్యులు కరోనా టెస్టులు చేస్తున్నారు.

కాగా ఏపీలో శనివారం 765 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇందులో రాష్ట్రానికి చెందిన కేసులు 727 కాగా, ఇతర రాష్ట్రాలు, విదేశాలకు చెందినవి 38 ఉన్నాయి. దీనితో రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 17,699కి చేరింది. ఇందులో 9,473 యాక్టివ్ కేసులు ఉండగా.. 8,008 మంది వైరస్ బారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. అటు రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 218కి చేరింది. ఇక నెల్లూరు జిల్లాలో 27 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Read More: నాగాలాండ్‌లో కుక్క మాంసం బ్యాన్..