బ్రేకింగ్: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో ప్రధాని భేటీ
భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఇరువురూ జాతీయ, అంతర్జాతీయంగా ఉన్న ప్రధాన అంశాలపై రాష్ట్రపతి భవన్‌లో చర్చించారు. తూర్పు లద్దాఖ్ లేహ్‌లోని ప్రధాని క్షేత్రస్థాయి పర్యటన అనంతరం రాష్ట్రపతితో భేటీ..
భారత ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో భేటీ అయ్యారు. ఇరువురూ జాతీయ, అంతర్జాతీయంగా ఉన్న ప్రధాన అంశాలపై రాష్ట్రపతి భవన్‌లో చర్చించారు. తూర్పు లద్దాఖ్ లేహ్‌లోని ప్రధాని క్షేత్రస్థాయి పర్యటన అనంతరం రాష్ట్రపతితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తన పర్యటన గురించి మోదీ, రాష్ట్రపతికి వివరించినట్టు రాష్ట్రపతి భవన్ ట్వీట్ చేసింది. అలాగే కరోనా వైరస్ పరిస్థితులపై కూడా ఇరువురూ చర్చించినట్లు సమాచారం.
కాగా గత కొద్దిరోజులుగా ఇండియా-చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ లద్దాఖ్ లేహ్‌లో పర్యటించి, అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. గాల్వాన్ ఘటనలో మరణం పొందిన అమర వీరులకు నివాళలర్పించారు. అనంతరం గాయపడ్డ జవాన్లను పరామర్శించిన తర్వాత చైనాను ఉద్ధేశించి తీవ్ర హెచ్చరికలు చేశారు.
#WATCH Prime Minister Narendra Modi called on President Ram Nath Kovind and briefed him on the issues of national and international importance at Rashtrapati Bhavan today pic.twitter.com/YPqOxAvtuK
— ANI (@ANI) July 5, 2020