సెకండ్ ఎకనమిక్ ప్యాకేజీ కోసం కసరత్తు.. మంత్రులతో మళ్ళీ మోదీ భేటీ

| Edited By: Pardhasaradhi Peri

May 02, 2020 | 6:17 PM

కరోనా మహమ్మారి కారణంగా కుదేలవుతున్న ఎకానమీని పునరుజ్జీవింపజేసేందుకు ప్రధాని మోదీ  రెండో సారి శనివారం కీలక సమావేశాన్ని నిర్వహించారు. మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, ఆర్ధిక, వాణిజ్య శాఖలకు చెందిన అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. నెలవారీ జీ ఎస్టీ వసూళ్ల వివరాల విడుదలను నిన్న వాయిదా వేసిన ఆర్ధిక శాఖ ఈ సాయంత్రం దీనిపై ప్రెజెంటేషన్ ఇచ్చింది. కాగా-మైక్రో, […]

సెకండ్ ఎకనమిక్ ప్యాకేజీ కోసం కసరత్తు.. మంత్రులతో మళ్ళీ మోదీ భేటీ
Follow us on

కరోనా మహమ్మారి కారణంగా కుదేలవుతున్న ఎకానమీని పునరుజ్జీవింపజేసేందుకు ప్రధాని మోదీ  రెండో సారి శనివారం కీలక సమావేశాన్ని నిర్వహించారు. మంత్రులు అమిత్ షా, నిర్మలా సీతారామన్, ఆర్ధిక, వాణిజ్య శాఖలకు చెందిన అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు తీసుకోవలసిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించారు. నెలవారీ జీ ఎస్టీ వసూళ్ల వివరాల విడుదలను నిన్న వాయిదా వేసిన ఆర్ధిక శాఖ ఈ సాయంత్రం దీనిపై ప్రెజెంటేషన్ ఇచ్చింది. కాగా-మైక్రో, చిన్న, మధ్య తరహా శాఖల మంత్రులతో కూడా ప్రధాని త్వరలో భేటీ కానున్నారు. లాక్ డౌన్ కష్టాలను అధిగమించేందుకు కేంద్రం గత మార్చి నెలలో 1.7 లక్షల కోట్లతో ప్యాకేజీని ప్రకటించింది. శుక్రవారం మోదీ.. పౌర విమానయాన, కార్మిక, విద్యుత్ శాఖల మంత్రులతో సమావేశమైన సంగతి తెలిసిందే.