లాక్‌డౌన్‌ను ఎలా ఎత్తేస్తారో.. చెప్పిన మోదీ

| Edited By:

Apr 03, 2020 | 10:49 AM

ఉమ్మడిగా ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తివేయకుండా.. దశలవారీగా వ్యూహాన్ని రూపొందించాలని మోదీ తెలిపారు. ప్రజలంతా ఒకేసారి రోడ్లపైకి రాకుండా పలు దఫాలుగా వచ్చేటట్లు చూడాలన్నారు. అంతేకాకుండా.. బయటకు వచ్చిన ప్రజలు తప్పకుండా..

లాక్‌డౌన్‌ను ఎలా ఎత్తేస్తారో.. చెప్పిన మోదీ
Follow us on

చైనా వైరస్‌ను తరిమికొట్టేందుకు ఏప్రిల్ 14 వరకూ ప్రధాని మోదీ లాక్‌‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అప్పటివరకూ ప్రజలెవరూ ఇల్లు విడిచి బయటకు రావొద్దని.. కరోనాకి అడ్డుకట్ట వేసేందుకు లాక్‌‌డౌన్ విధిస్తున్నట్లు చెప్పారు మోదీ. అయితే ఇప్పుడు ఏప్రిల్ 14న లాక్‌డౌన్ ఎత్తేస్తే.. ప్రజలంతా మూకుమ్మడిగా బయటకు వచ్చే ప్రమాదం ఉంది. దీంతో ఇంత కాలం చేసిందంతా వృథా అవుతుంది. ఈ నేపథ్యంలో వ్యాధిని కంట్రోల్ చేసేందుకు.. సీఎంలతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు విషయాలు వెల్లడించినట్లు సమాచారం.

ఉమ్మడిగా ఒకేసారి లాక్‌డౌన్ ఎత్తివేయకుండా.. దశలవారీగా వ్యూహాన్ని రూపొందించాలని మోదీ తెలిపారు. ప్రజలంతా ఒకేసారి రోడ్లపైకి రాకుండా పలు దఫాలుగా వచ్చేటట్లు చూడాలన్నారు. అంతేకాకుండా.. బయటకు వచ్చిన ప్రజలు తప్పకుండా సామాజిక దూరం పాటించాలన్నారు. కరోనా వైరస్ నియంత్రణకు వచ్చే కొద్ది వారాల్లో వైద్య పరీక్షలు, బాధితుల గుర్తింపు, ఐసోలేషన్, క్వారంటైన్ అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని నిర్దేశించారు. హాట్‌స్పాట్‌లను(కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ప్రదేశాలు) గుర్తించి వైరస్ వ్యాప్తి చెందకుండా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని చెప్పారు. అలాగే ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్ కరోనా కేసులపైనా.. సీఎంలకి అడిగి ఆరా తీశారు. ముఖ్యంగా ప్రజలందరూ సంయమనం పాటించాలని ప్రధాని మోదీ కోరారు.

ఇవి కూడా చదవండి: 

కరోనాపై మోదీ మరో సందేశం.. ఏప్రిల్ 5న అందరూ జాగరణ చేయాలి

చైనాలో మళ్లీ అలజడి.. ఓ మహిళకు కరోనా

గాంధీ ఆసుపత్రి ఘటనపై సీరియస్ అయిన కేటీఆర్

వికారాబాద్ పొలంలో 200 ఏళ్లనాటి వెండి నాణేలు..

విద్యుత్ ఛార్జీల అంశంలో ఏపీఎస్‌పీడీసీఎల్ కీలక నిర్ణయం

ప్రభాస్‌ నిజంగానే బాహుబలి అనిపించుకున్నాడు.. టీడీపీ సీనియర్ నేత ప్రశంసలు

దేశవ్యాప్తంగా కరోనా ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్న 10 హాట్‌స్పాట్ కేంద్రాలివే