COVID-19 Vaccine: కోవిడ్ వ్యాక్సినేషన్‌‌లో మరో మైలురాయి.. 25 కోట్లు దాటిన లబ్ధిదారుల సంఖ్య

|

Jun 13, 2021 | 8:33 AM

India Corona Vaccination: భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య కొంతమేర తగ్గుముఖం పడుతోంది. నిత్యం లక్షకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. కాగా.. ఇటీవల నమోదవుతున్న

COVID-19 Vaccine: కోవిడ్ వ్యాక్సినేషన్‌‌లో మరో మైలురాయి.. 25 కోట్లు దాటిన లబ్ధిదారుల సంఖ్య
Coronavirus Vaccination
Follow us on

India Corona Vaccination: భారత్‌లో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. ఇప్పుడిప్పుడే కేసుల సంఖ్య కొంతమేర తగ్గుముఖం పడుతోంది. నిత్యం లక్షకు చేరువలో కేసులు నమోదవుతున్నాయి. కాగా.. ఇటీవల నమోదవుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా దేశంలో ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కరోనాకు వ్యతిరేకంగా కొనసాగుతున్న టీకా డ్రైవ్‌లో భారత్‌ మరో మైలురాయిని అధిగమించింది. శనివారం నాటికి టీకా డ్రైవ్‌ 148వ రోజుకు చేరింది. ఇప్పటివరకు 25,28,78,702కు పైగా డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఇందులో 20,46,01,176 తొలి టీకా డోసులు వేసి మరో మైలురాయిని అధిగమించినట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం పేర్కొంది.

కాగా.. శనివారం ఒకే రోజు మొత్తం 31,67,961 వ్యాక్సిన్ మోతాదులు పంపిణీ చేసినట్లు చెప్పింది. ఇందులో తొలి డోసును 28,11,307 మంది లబ్ధిదారులకు వేయగా, మరో 3,56,654 మంది లబ్ధిదారులకు రెండో మోతాదును అందజేసినట్లు తెలిపింది. 18-44 ఏజ్‌ గ్రూప్‌లో 18,45,201 మంది లబ్ధిదారులు మొదటి మోతాదును వేయగా.. 1,12,633 మంది లబ్ధిదారులకు సెకండ్‌ డోస్‌ వ్యాక్సిన్‌ అందించినట్లు పేర్కొంది. కాగా.. థర్డ్ వేవ్ ఉంటుందన్న సూచనలతో కేంద్ర ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతంగా నిర్వహిస్తోంది.

Also Read:

Telangana Home Minister: తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. త్వరలో పోలీస్ శాఖలో 20 వేల పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్

Telangana CM KCR: ప్రగతి భవన్‌లో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష.. పలు కీలక అంశాలపై చర్చ..!