Goa Corona: కొంపముంచిన గోవా టూర్.. క్రూజ్‌ నౌకలో కరోనా కలకలం.. మోర్ముగావ్‌ తీరంలో చిక్కుకున్న 2వేల మంది!

|

Jan 03, 2022 | 5:10 PM

Mormugao port: న్యూ ఇయర్‌ గోవా మెడకు చుట్టుకుంది.. వేడుకల కోసం వచ్చిన జనం.. కరోనాను కూడా వెంటబెట్టుకొచ్చారు. ఫలితంగా పాజిటివిటీ రేటు అమాంతం పెరిగిపోయింది.

Goa Corona: కొంపముంచిన గోవా టూర్.. క్రూజ్‌ నౌకలో కరోనా కలకలం.. మోర్ముగావ్‌ తీరంలో చిక్కుకున్న 2వేల మంది!
Mormugao Port Ship
Follow us on

Passengers stuck on ship at Goa Mormugao port: న్యూ ఇయర్‌ గోవా మెడకు చుట్టుకుంది.. వేడుకల కోసం వచ్చిన జనం.. కరోనాను కూడా వెంటబెట్టుకొచ్చారు. ఫలితంగా పాజిటివిటీ రేటు అమాంతం పెరిగిపోయింది. ముంబై నుంచి గోవా వెళ్లిన ఓ క్రూజ్‌ నౌకలో కరోనా కలకలం రేగింది. నౌకలోని సిబ్బంది ఒకరికి వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో దాదాపు 2 వేల మందికి పైగా ప్రయాణికులు గోవా తీరంలోనే చిక్కుకుపోవాల్సి వచ్చింది. ముంబై పోర్ట్‌ నుంచి 2016 మంది ప్రయాణికులు, సిబ్బందితో గోవా బయల్దేరిన కార్డెలియా క్రూజ్‌ నౌకలో సిబ్బంది ఒకరు అనారోగ్యానికి గురయ్యారు. దీంతో నౌకలో వైద్యులు ఆ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. యాంటిజెన్‌ టెస్ట్‌లో పాజిటివ్‌గా తేలింది. కరోనా సోకినట్లు తేలగానే నౌకను గోవా తీరంలో నిలిపేందుకు అధికారులు అంగీకరించలేదు. దీంతో మోర్ముగావ్‌ తీరంలో నిలిపారు.

అప్రమత్తమైన అధికారులు నౌకలోని వారందరికీ పరీక్షలు ప్రారంభించారు. వాటి ఫలితాలు వచ్చే వరకు ప్రయాణికులెవరూ నౌక నుంచి దిగేందుకు అనుమతి లేదని వెల్లడించారు. దీంతో నిన్నటి నుంచి వారంతా షిప్‌లోనే చిక్కుకుపోయారు. ఇదిలా ఉండగా.. నౌకలో ఎక్కిన వారంతా రెండు డోసుల టీకా తీసుకున్నవారేనని కార్డెలియా క్రూజ్‌ ప్రతినిధులు చెప్పారు. కరోనా నిర్ధారణ అయిన వ్యక్తిని ప్రస్తుతం నౌకలోనే ఐసోలేషన్‌లో ఉంచినట్లు వెల్లడించారు.

మరోవైపు.. గోవాలో కొవిడ్‌ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల కోసం అనేక రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివచ్చారు. ఒక్క ఆదివారమే 3 వేల 604 మందికి పరీక్షలు నిర్వహించగా.. 388 మందికి కొవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. పాజిటివిటీ రేటు 10.7 శాతంగా నమోదైంది. కొవిడ్‌ తగ్గుముఖం పట్టడంతో ఇటీవల ఆంక్షల్ని ఎత్తేసింది గోవా ప్రభుత్వం. దీంతో గోవాకు పోటెత్తారు పర్యాటకులు.

Read Also…  Viral Video: ఆమ్లెట్ వేసేందుకు గుడ్డు పగలగొట్టగానే బయటకు వచ్చిన అతిథి.. అందరూ షాక్

Punjab Elections:12వ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థినికి 20 వేల రూపాయలుః నవజ్యోత్ సింగ్ సిద్ధూ