దేశవ్యాప్తంగా వాహనదారులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రం. ఎక్స్‌పైరీ అయిన డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ రిజిస్ట్రేషన్, ఫిట్‌నెస్ సర్టిఫికెట్, పర్మిట్ గడువును ఈ ఏడాది జూన్ 30 వరకు కేంద్రం పెంచింది. కరోనా పాజిటివ్ కేసుల కారణంగా వాటిని రెన్యువల్ చేసుకోవడంలో వాహనదారులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో కేంద్రం తాజాగా గడువు పెంచింది.
అంటే గత ఏడాది ఫిబ్రవరి 1 తర్వాత ఎక్స్‌పైరీ అయిన వాటి గడువు 2021 జూన్ 30 వరకు చెల్లుబాటు అవుతుంది. గతంలో ఇచ్చిన గడువు ఈ నెల 31తో ముగుస్తుండటంతో తాజాగా గడువు పెంచింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీని కేంద్ర రోడ్డు, రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ జారీ చేసింది. మోటార్ వెహికిల్ యాక్ట్-1988, సెంట్రల్ మోటార్ వెహికిల్ రూల్స్-1989 కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటికీ ఈ గడువు పొడిగింపు వర్తిస్తుంది.
భారత్‌లో కరోనా అలారం ఓ రేంజ్‌లో మోగుతోంది. రోజువారీ కేసుల సంఖ్య 50 వేల పైకి చేరింది. దీంతో వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచేందుకు ఎగుమతులను సైతం ఆపేసింది ప్రభుత్వం. సెకండ్ వేవ్ మరో 100 రోజులనే మాటతో గుండెల్లో గుబులు రేగుతోంది.
ఇక కరోనా ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీలో ఒక్కరోజే 55 మందికి పాజిటివ్‌గా తేలింది. గురువారం 800 శాంపిల్స్ సేకరించగా.. 400 మందికి రిపోర్ట్ వచ్చింది. మరో 400 శాంపిళ్ల ఫలితాలు రావాల్సి ఉంది. ఇప్పటికి 55 మందికి పాజిటివ్‌గా వచ్చింది.. వాళ్లందరినీ హాస్టల్స్‌లోనే ఉంచి చికిత్స అందిస్తామన్నారు అధికారులు. మిగతావారిని క్వారంటైన్‌కు తరలిస్తామన్నారు. విద్యార్థులందర్నీ పరీక్షించి.. తగిన జాగ్రత్తలు తీసుకుంటామని.. పేరెంట్స్ ఆందోళన చెందవద్దని సూచించారు.