AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్ న్యూస్‌: రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో పాజిటివ్‌ కేసు, 500 మంది

అత్య‌ధిక పాజిటివ్ కేసులు న‌మోదైన ప్రాంతాల్లో దేశంలోనే ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. తాజాగా క‌రోనా వైర‌స్ రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్‌కు పాకినట్లు తెలుస్తోంది.

బ్రేకింగ్ న్యూస్‌: రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో పాజిటివ్‌ కేసు, 500 మంది
Jyothi Gadda
|

Updated on: Apr 21, 2020 | 6:40 AM

Share
దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా విజృంభ‌ణ కొన‌సాగుతోంది. కోర‌లు చాస్తున్న కోవిడ్ వైర‌స్‌ కరాళనృత్యం చేస్తోంది. క‌రోనా వైర‌స్ కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా ఢిల్లీ తీవ్రంగా స‌త‌మ‌త‌మ‌వుతోంది. ఇప్ప‌టికే రెండు వేల‌కుపైగా కరోనా పాజిటివ్ న‌మోద‌య్యాయి. 47 మంది మ‌ర‌ణించారు. అత్య‌ధిక పాజిటివ్ కేసులు న‌మోదైన ప్రాంతాల్లో దేశంలోనే ఢిల్లీ రెండో స్థానంలో నిలిచింది. దీని క‌ట్ట‌డికోసం కేంద్రం విధించిన లాక్‌డౌన్ నిబంధ‌న‌లు య‌థాత‌థంగా కొన‌సాగించాల‌ని సీఎం కేజ్రీవాల్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. తాజాగా క‌రోనా వైర‌స్ రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్‌కు పాకినట్లు తెలుస్తోంది.
హ‌స్తిన‌లో క‌రోనా వైర‌స్ వ్యాప్తి ఆగ‌డం లేదు. ప్ర‌తిష్టాత్మ‌క రాష్ట్ర‌ప‌తిభ‌వ‌న్‌లో క‌రోనా పాజిటివ్ కేసు వెలుగులోకి వ‌చ్చింది. రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌లో ప‌నిచేసే ఒక‌ పారిశుధ్య కార్మికుని బంధువుకు క‌రోనా పాజిటివ్‌గా తేలిన‌ట్లు తెలుస్తోంది. మ‌రోవైపు అత‌ని త‌ల్లి ఇప్ప‌టికే క‌రోనాతో మ‌ర‌ణించిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో కార్మికుని ఇంటిని అధికారులు సీజ్ చేశారు. కుటుంబ స‌భ్యుల‌ను ఈ నెల 18నే క్వారంటైన్‌కు పంపించారు. మ‌రోవైపు కార్మికుని ఇంటికి స‌మీపంలోని 30 ఉద్యోగ‌ కుటుంబాల‌ను అధికారు ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంచారు. ప్ర‌భుత్వమే వారికి ఆహారం స‌ర‌ఫరా చేస్తోంది. తాజాగా మ‌రో 95 కుటుంబాల‌ను క్వారంటైన్‌లో ఉంచిన‌ట్లు తెలుస్తోంది. ఉద్యోగులతోపాటు కుటుంబంలోని ఎవ‌రినీ ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్ల‌వ‌ద్ద‌ని అధికారులు సూచించారు. మొత్తంమీద ఈ 125 కుటుంబాల నుంచి 500 మందిని సెల్ఫ్ ఐసోలేష‌న్‌లో ఉంచినట్లు స‌మాచారం.

నిండు నూరేళ్లు జీవించాలా.. మీ కాళ్లలోనే అసలు రహస్యం.. 30 సెకన్లలో
నిండు నూరేళ్లు జీవించాలా.. మీ కాళ్లలోనే అసలు రహస్యం.. 30 సెకన్లలో
ఏంటీ.! సుమన్ శెట్టికి బిగ్‌బాస్‌లో విన్నర్ కంటే భారీ రెమ్యునరేషనా
ఏంటీ.! సుమన్ శెట్టికి బిగ్‌బాస్‌లో విన్నర్ కంటే భారీ రెమ్యునరేషనా
ఏంది సామీ ఈ కొట్టుడు? సెంచరీ కొట్టడానికి గంట కూడా పట్టలేదుగా
ఏంది సామీ ఈ కొట్టుడు? సెంచరీ కొట్టడానికి గంట కూడా పట్టలేదుగా
12 ఏళ్లకు మించి బతకడన్నారు... కట్ చేస్తే.. వేలంలో
12 ఏళ్లకు మించి బతకడన్నారు... కట్ చేస్తే.. వేలంలో
ఆ ఫుడ్స్‎ని కుక్కర్‌లో ఎన్ని విజిల్స్ వరకు ఉంచాలి? నిపుణుల మాటంటే
ఆ ఫుడ్స్‎ని కుక్కర్‌లో ఎన్ని విజిల్స్ వరకు ఉంచాలి? నిపుణుల మాటంటే
నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
నిరుద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం
నేషనల్ లెవెల్‌లోనూ టాలీవుడ్ స్టార్ల హవా.. టాప్‌ 10లో ఆరుగురు
నేషనల్ లెవెల్‌లోనూ టాలీవుడ్ స్టార్ల హవా.. టాప్‌ 10లో ఆరుగురు
సచిన్‌లా క్రికెటర్‌ అవ్వాలనుకున్నాడు.. ఇప్పుడు టాలీవుడ్ హీరోగా..
సచిన్‌లా క్రికెటర్‌ అవ్వాలనుకున్నాడు.. ఇప్పుడు టాలీవుడ్ హీరోగా..
బజ్ బాల్ అంటే ఇదేనా బాబూ? 11 రోజుల్లోనే ప్యాకప్ చెప్పేశారు
బజ్ బాల్ అంటే ఇదేనా బాబూ? 11 రోజుల్లోనే ప్యాకప్ చెప్పేశారు
చలికాలంలో ఉదయమే గుండెపోట్లు ఎందుకు వస్తాయి.. చలితో ఉన్న..
చలికాలంలో ఉదయమే గుండెపోట్లు ఎందుకు వస్తాయి.. చలితో ఉన్న..