పల్లెలకు అంటని కరోనా…

కరోనా వైరస్…భారత్ సహా ప్రపంచదేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ ఇతరదేశాలకు వ్యాప్తి చెంది మరణమ్రుదంగం మోగిస్తోంది. మార్చి నుండి భారత్ లోనూ ఈ వైరస్ ప్రభావం చూపుతోంది. దీంతో మహమ్మారి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. కట్టుదిట్టమైన కట్టడితో కోవిడ్ -19 ఇప్పటికే ఇండియాలో మొత్తం 736 జిల్లాలకుగానూ… 411జిల్లాలో మాత్రమే కేసులు నమోదయ్యాయి. సుమారు 325 జిల్లాలో అస్సలు కరోనా కేసులే నమోదు కాలేదు. అంటే […]

పల్లెలకు అంటని కరోనా...
Follow us

|

Updated on: Apr 20, 2020 | 10:44 PM

కరోనా వైరస్…భారత్ సహా ప్రపంచదేశాలను వణికిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీలో పుట్టిన ఈ వైరస్ ఇతరదేశాలకు వ్యాప్తి చెంది మరణమ్రుదంగం మోగిస్తోంది. మార్చి నుండి భారత్ లోనూ ఈ వైరస్ ప్రభావం చూపుతోంది. దీంతో మహమ్మారి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. కట్టుదిట్టమైన కట్టడితో కోవిడ్ -19 ఇప్పటికే ఇండియాలో మొత్తం 736 జిల్లాలకుగానూ… 411జిల్లాలో మాత్రమే కేసులు నమోదయ్యాయి. సుమారు 325 జిల్లాలో అస్సలు కరోనా కేసులే నమోదు కాలేదు. అంటే దాదాపు ఇండియాలో సగభాగం ఇంకా కోవిడ్ కేసులు లేకపోవడం ఊరటనిచ్చే అంశం. మరోవైపు భారత్ లో మొత్తం కరోనా వైరస్ కేసులలో దాదాపు 46 శాతం అంటే కేవలం 18 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. ఈ జిల్లాలో సుమారు వందకుపైగా కోవిడ్ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం గుర్తించింది. మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతాలను కంటైన్ మెంట్ క్లస్టర్ల్ గా విభజించి వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం కఠినచర్యలు చేపట్టింది. అంతేకాదు ఎమర్జెన్సీ సర్వీసులు మినహా లాక్ డౌన్ ను దేశవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టి వైరస్ వ్యాపించకుండా కఠినచర్యలు అమలు చేస్తోంది. రెడ్, గ్రీన్, ఆరెంజ్ జోన్లుగా విభజించి ప్రత్యేక చర్యలు చేపట్టింది. భారత్ లో కరోనా వైరస్ కొన్ని నగరాల్లోనే ఎక్కువ ప్రభావం చూపుతోంది. మహారాష్ట్రలోని ముంబై, మధ్యప్రదేశ్ లోని ఇండోర్, తెలంగాణలోని హైదరాబాద్, ఛత్తీస్ గఢ్ లోని కోర్బా, జార్ఖండ్ లోని రాంచి, ఒడిశాలోని కుర్ధాలో మహమ్మారి విజ్రుంభిస్తోంది. భారత్ లో నమోదైన కరోనా కేసులలో 50 శాతానికి పైగా ఈ నగరాల్లోనే ఉన్నాయి. అంతేకాదు ఢిల్లీ , తమిళనాడు మినహా అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో నమోదైన కేసుల్లో నాలుగోవంతు లేదా అంతకంకంటే ఎక్కువ అత్యధికంగా ప్రభావితమైనవిగా ఉన్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో వైరస్ ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టింది.

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
హైదరాబాద్ లో ఆ మార్గంలో మెట్రో రైళ్ల సమయం పొడిగింపు