తెలంగాణలో టిమ్స్.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎం..

రంగారెడ్డి జిల్లాలోని గచ్చిబౌలి స్టేడియంలో ఉన్న 13 అంతస్తుల భవనంలో 1500 బెడ్లతో ఉస్మానియా ఆసుపత్రికి అనుబంధంగా తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఏర్పాటుకు ప్రభుత్వం శనివారం రాత్రి జీవో నెంబర్ 22ను..

తెలంగాణలో టిమ్స్.. ఉత్తర్వులు జారీ చేసిన సీఎం..

Edited By:

Updated on: Apr 26, 2020 | 2:09 PM

రంగారెడ్డి జిల్లాలోని గచ్చిబౌలి స్టేడియంలో ఉన్న 13 అంతస్తుల భవనంలో 1500 బెడ్లతో ఉస్మానియా ఆసుపత్రికి అనుబంధంగా తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్) ఏర్పాటుకు ప్రభుత్వం శనివారం రాత్రి జీవో నెంబర్ 22ను జారీ చేసింది. కరోనా ఆసుపత్రిగా ప్రారంభమైన టిమ్స్‌ను జాతీయ ప్రాధాన్యం గల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా మార్చి తర్వాత.. వైద్య విద్య పరిశోధన సంస్థగా చేస్తామని ఉత్తర్వులో తెలిపింది. అలాగే టిమ్స్ అభివృద్ధి కోసం రూ.6.5 కోట్లు ఇచ్చింది. స్థానికంగా వైద్య సౌకర్యాల కోసం ఇప్పటికే రూ.18.50 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడిచ్చిన డబ్బుతో స్పోర్ట్స్ రెస్ట్ హౌస్‌ను కరోనా ఐసోలేషన్ సెంటర్‌గా మార్చుతామని ఉత్తర్వుల్లో తెలిపారు కేసీఆర్. కాగా టిమ్స్ ఏర్పాటుతో కరోనా వైరస్‌ను మరింత బలంగా ఎదుర్కోవడానికి, పరిశోధనలు చేయడానికి వీలు కానుంది.

కాగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు 990కి చేరాయి. ఇప్పటివరకూ కరోనాతో 25 మంది మృతి చెందారు. అలాగే ఇప్పటివరకూ 307 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం తెలంగాణలో 658 మంది ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు.

Read More: 

తెలంగాణలో ఇకపై ఆ పేర్లు ఉండవ్.. కేసీఆర్ కీలక నిర్ణయం

లాక్‌డౌన్ ఫ్రస్ట్రేషన్‌ తెలిపితే.. డబ్బులే డబ్బులు!

అక్షయ తృతీయ బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయితో బంగారాన్ని కొనుగోలు చేసుకోవచ్చు!