ఒడిషాలో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు

ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అన్‌లాక్ 1.0 ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో కేసుల..

Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 15, 2020 | 5:45 PM

ఒడిషాలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. ముఖ్యంగా అన్‌లాక్ 1.0 ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి రాష్ట్రంలో కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా మరో 2,496 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 57,126కి చేరింది. వీటిలో కరోనా నుంచి కోలుకుని 39,205 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 17,535 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ విషయాన్ని ఒడిషా రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8.55 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించినట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇక గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 9 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా బారినపడి 333 మంది మరణించారు. కాగా, కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రభుత్వం టెస్టుల సంఖ్యను మరింత పెంచుతోంది.

Read More :

16 వేల అడుగుల ఎత్తులో రెపరెపలాడిన జాతీయ జెండా

అసోం వరదల బీభత్సం.. 112కి చేరిన మృతులు

ఏనుగు దాడిలో ఫారెస్ట్‌ రేంజ్‌ ఆఫీసర్ మృతి