ఇంగ్లాండ్‌: స్మార్ట్‌వాచ్‌ ధరించిన అంపైర్‌.. ఐసీసీ మందలింపు!

ఇంగ్లాండ్ లో ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ మధ్య సౌతాంప్టన్‌ వేదికగా రెండో టెస్టు జరుగుతున్న సంగతి విదితమే. ఈ టెస్టుకు ఇంగ్లీష్‌ అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బరో ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌గా వ్యవహరిస్తున్నారు. మ్యాచ్‌ సమయంలో స్మార్ట్‌వాచ్

ఇంగ్లాండ్‌: స్మార్ట్‌వాచ్‌ ధరించిన అంపైర్‌.. ఐసీసీ మందలింపు!
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 15, 2020 | 4:43 PM

ఇంగ్లాండ్ లో ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ మధ్య సౌతాంప్టన్‌ వేదికగా రెండో టెస్టు జరుగుతున్న సంగతి విదితమే. ఈ టెస్టుకు ఇంగ్లీష్‌ అంపైర్‌ రిచర్డ్‌ కెటిల్‌బరో ఆన్‌ఫీల్డ్‌ అంపైర్‌గా వ్యవహరిస్తున్నారు. మ్యాచ్‌ సమయంలో స్మార్ట్‌వాచ్‌ ధరించినందుకు అంపైర్‌ రిచర్డ్‌ను ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌(ఐసీసీ) మందలించింది. రెండో టెస్టు ఓపెనింగ్‌ డే మొదటి సెషన్‌లో 47ఏండ్ల కెటిల్‌బరో స్మార్ట్‌వాచ్‌ ధరించి మైదానంలోకి అడుగుపెట్టాడు.

అవినీతిని అరికట్టే క్రమంలో స్మార్ట్ వాచ్ సహా కమ్యూనికేషన్ పరికరాలను ఐసిసి 2018 లో ఆట సమయంలో, డ్రెస్సింగ్ రూమ్ లో కూడా నిషేధించింది. కాగా.. తన తప్పును తెలుసుకున్న అంపైర్‌ కెటిల్‌బరో వెంటనే వాచ్‌ను తీసివేశాడు. మ్యాచ్‌ ఆరంభ రోజు భోజనం విరామం తర్వాత వాచ్‌ లేకుండానే అంపైర్‌ విధులు నిర్వర్తించారు. ఐతే రిచర్డ్‌ స్మార్ట్‌వాచ్‌ ధరించడంతో అతనితో ఐసీసీ అవినీతి నిరోధక విభాగం(ఏసీయూ) మాట్లాడిందని ఒక నివేదిక తెలిపింది. నిబంధనలకు విరుద్దంగా వాచ్‌ ధరించినందుకు రిచర్డ్‌ను ఐసీసీ మందలించింది.

Read More:

తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రికార్డు స్థాయిలో 27 సెంటీమీటర్లు..!

ఐపీఎల్ 2020: 10 సెక‌న్ల యాడ్‌కు రూ.10 ల‌క్ష‌లు..!