దేశంలో యుద్ధాన్ని మించిన హెల్త్ ఎమర్జెన్సీ… ఉప్పెనలా దూసుకొస్తున్న సెకండ్ వేవ్.. బెడ్స్, ఆక్సిజ‌న్ కొర‌త లేదన్న డీఎంహెచ్‌వో

కరోనాపై తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్దం అవుతోంది. ఎక్కడా ఎలాంటి బెడ్స్‌ కొరత లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప‌బ్లిక్ హెల్త్ డైరక్టర్ శ్రీనివాస్‌ రావు స్పష్టం చేశారు.

దేశంలో యుద్ధాన్ని మించిన హెల్త్ ఎమర్జెన్సీ... ఉప్పెనలా దూసుకొస్తున్న సెకండ్ వేవ్.. బెడ్స్, ఆక్సిజ‌న్ కొర‌త లేదన్న డీఎంహెచ్‌వో
Director Of Public Health Dr Srinivas Rao
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 17, 2021 | 5:47 PM

Dr Srinivas Rao on corona spread: భారత్‌లో కరోనా సెకండ్‌ వేవ్‌ ఉప్పెనలా విరుచుకుపడోంది. ఏప్రిల్‌ నెలలో ఇప్పటి వరకూ దేశంలో 20.65 లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూస్తే వైరస్‌ ఎంతవేగంగా విస్తరిస్తుందో అర్థం చేసుకోవచ్చు. వైరస్‌తో అల్లకల్లోలమైన అమెరికాలో రోజువారీ కేసుల సంఖ్య లక్ష నుంచి రెండు లక్షలకు చేరడానికి 20 రోజుల సమయం పట్టింది. కానీ భారత్‌లో కేవలం పదిరోజులే పట్టింది. భారత్‌లో ఏపిల్ర్‌ 4న కేసులసంఖ్య లక్ష మార్కును దాటగా.. 14న రెండు లక్షల మార్కును దాటేసింది.

కరోనాపై తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్దం అవుతోంది. ఎక్కడా ఎలాంటి బెడ్స్‌ కొరత లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప‌బ్లిక్ హెల్త్ డైరక్టర్ శ్రీనివాస్‌ రావు స్పష్టం చేశారు. కరోనా వైరస్‌కు ఆస్తి అంతస్తులు లేవంటున్నారు. ప్రపంచ దేశాలనే నేలచూపులు చూపించిందని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణలోకి వచ్చే వారి నుంచి అత్యధిక కేసులు నమోదవుతున్నట్లు ఆయన వెల్లడించారు. మొదట మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిలో 20 మందికి వచ్చాయన్నారు. వారి నుంచి దాదాపుగా 5వందల మందికి వచ్చిందన్నారు. తెలంగాణలో ఇదే అతి పెద్ద బ్రేక్‌ వంటిదన్నారు.

రాష్ర్టంలో కొవిడ్ చికిత్స‌కు ప‌డ‌క‌లు, మందులు, ఆక్సిజ‌న్ కొర‌త లేదని ప‌బ్లిక్ హెల్త్ డైరెక్టర్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స కొన‌సాగుతుంద‌ని ఆయన తెలిపారు. క‌రోనా రెండో ద‌శ ఉధృతంగా వ్యాప్తి చెందుతుందన్న ఆయన.. తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలు అప్రమత్తంగా ఉందన్నారు. క‌రోనా తొలి ద‌శ నుంచి ప్రజ‌లు పాఠాలు నేర్చుకోలేదని, క‌రోనా వెళ్లిపోయింద‌నే భ్రమ‌లో జ‌నం ఉన్నారు. మొద‌టి వేవ్‌ను ఎంతో కొంత అడ్డుకోగ‌లిగాం. ప్రజ‌ల్లో అల‌స‌త్వం వ‌చ్చింది. గాలి నుంచి వ్యాపించే ద‌శ‌కు క‌రోనా చేరుకుంద‌ని పేర్కొన్నారు. కొత్త మ్యుటేష‌న్ల కార‌ణంగా క‌రోనా వేగంగా వ్యాపిస్తోంద‌న్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధ‌రించాల‌ని ఆయన సూచించారు.

రాష్ర్టంలో ఎక్కడా బెడ్ల కొర‌త లేద‌ని, కేవ‌లం 15 20 కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే ప‌డ‌క‌ల కొర‌త ఉంద‌ని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో 5 కొవిడ్ ప్రత్యేక ఆస్పత్రులు నిర్వహిస్తున్నామ‌ని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కొవిడ్ టెస్టుల సంఖ్యను మరింతగా పెంచుతామ‌ని ప్రకటించారు. 80 శాతం మంది క‌రోనా బాధితుల్లో ఎలాంటి ల‌క్షణాలు లేవని, క‌రోనా పాజిటివ్ రాగానే ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

రోజుకు ల‌క్షకు పైగా క‌రోనా నిర్ధారణ ప‌రీక్షలు నిర్వహిస్తున్నామని డీఎంహెచ్‌వో తెలిపారు. కేవ‌లం 15 రోజుల్లో పాజిటివ్ రేటు రెట్టింపు అయ్యింద‌న్నారు. శుక్రవారం ఒక్కరోజే ల‌క్షా 26 వేల క‌రోనా ప‌రీక్షలు నిర్వహిస్తే.. 4,446 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయ‌ని తెలిపారు. కొవిడ్ వ్యాప్తి చెందిన తొలినాళ్లలో 18 వేల బెడ్లు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్యను 38 వేల‌కు పెంచామ‌న్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో బెడ్ల సంఖ్యను 53 వేల‌కు పెంచుతామ‌ని తెలిపారు. కొవిడ్ టెస్టుల సంఖ్యను కూడా పెంచుతామ‌న్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 116 ప్రభుత్వ ఆస్పత్రులు, 1,935 ప్రైవేటు ఆస్పత్రులకు కొవిడ్‌ ట్రీట్‌మెంట్‌కు అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు శ్రీనివాస్‌. బెడ్స్‌ పరంగా రాష్ట్రంలో ఎక్కడా కొరత లేదన్నారు. 53వేల బెడ్స్‌ ఆస్పత్రుల్లో ఉన్నాయని గుర్తు చేశారు.

మ‌హారాష్ర్ట నుంచి ఓ ఉత్సవం నిమిత్తం స‌రిహ‌ద్దు జిల్లాకు మార్చి 24న‌ 20 మంది వ‌చ్చారు. అక్కడ జ‌రిగిన ఆ ఉత్సవంలో స‌రిహ‌ద్దు జిల్లాకు చెందిన మ‌రో 30 మంది పాల్గొన్నారు. వారిలో క‌రోనా ల‌క్షణాలు క‌నిపించ‌డంతో ప‌రీక్షలు నిర్వహించ‌గా ఐదుగురికి పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింది. ఆ ఐదుగురి కాంటాక్ట్స్‌ను గుర్తించ‌గా మ‌రో 34 మందికి క‌రోనా సోకిన‌ట్లు తేలింది. అలా 34 మంది 433 మందికి క‌రోనా వ్యాపించింది. ఇదంతా కేవ‌లం 12 రోజుల్లోనే జ‌రిగిపోయింద‌న్నారు.

డ్రగ్స్‌ను ఎక్కువగా వాడితే కూడా నష్టాలు ఎక్కువగానే ఉన్నాయంటున్నారు డీఎంహెచ్‌ఓ శ్రీనివాస్. కరోనా వచ్చిన వారు రిమిడెసివీర్‌ కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారని.. ఇది మంచి పద్దతి కాదన్నారు. రాబోయే జూన్‌ వరకు ఇదే పరిస్థితి ఉంటుందన్నారు శ్రీనివాస్‌.. బయటకు వెళ్లేవారు తగిన జాగ్రతలు, రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లాక్‌డౌన్‌ పెట్టే ఆలోచన లేదన్న ఆయన.. మనకు జాగ్రత్తపడాల్సిన అవసరం ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవు. ఎవరైతే ఆక్సిజన్‌ను బ్లాక్‌ చేసినా కేసులు తప్పవన్నారు.

Read Also…  Corona Virus: కొత్త భయం.. కోవిడ్ ఉన్నా..ఆర్‌టీపీసీఆర్‌ టెస్టుల్లో నెగెటివ్! ఎందుకలా?