‘మా దేశంలో ఒక్క కరోనా కేసూ లేదు..నమ్మండి !’…చైనా

తమ దేశంలో ప్రస్తుతం ఒక్క కరోనా కేసు కూడా లేదని చైనా ప్రకటించింది. గత జనవరిలో కరోనా సంబంధ డేటాను ప్రకటించడం మొదలుపెట్టినప్పటి నుంచీ ఆ దేశ ప్రభుత్వం ఈ విధమైన ప్రకటన చేయడం ఇదే మొదటిసారి.

'మా దేశంలో ఒక్క కరోనా కేసూ లేదు..నమ్మండి !'...చైనా
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 23, 2020 | 4:08 PM

తమ దేశంలో ప్రస్తుతం ఒక్క కరోనా కేసు కూడా లేదని చైనా ప్రకటించింది. గత జనవరిలో కరోనా సంబంధ డేటాను ప్రకటించడం మొదలుపెట్టినప్పటి నుంచీ ఆ దేశ ప్రభుత్వం ఈ విధమైన ప్రకటన చేయడం ఇదే మొదటిసారి. కరోనా వైరస్ ఫైట్ లో తాము ‘ఘన విజయాలు సాధించామని’ కమ్యూనిస్టు పార్టీ నేతలు సెలబ్రేట్ చేసుకున్న మరుసటి రోజే ఈ తాజా కబురును ఆ దేశం అందించింది. ఈ నెల 21 న నాలుగు  కొత్త అనుమానిత కేసులు నమోదయ్యాయని, షాంగైలో ఓ ఇంపోర్టెడ్ కేసు, జిలిన్ ప్రావిన్స్ లో లోకల్ ట్రాన్స్ మిషన్ కేసు నమోదయ్యాయని నేషనల్ హెల్త్ కమిషన్ వెల్లడించింది. 35 ఎ సింప్టోమాటిక్ కేసులు 28 కి తగ్గిపోయాయని, ఇక కొత్త కేసులేవీ లేనట్టేనని వెల్లడించింది. సుదీర్ఘ కాలం లాక్ డౌన్ కారణంగా మార్చి నెల నుంచే చైనాలో లోకల్ గా సంక్రమించిన కేసులు తగ్గుతూ వచ్చాయి. రష్యా సరిహద్దుల్లో ఉన్న జిలిన్, హీలాంగ్ జియాంగ్ రాష్ట్రాలకు చేరుకున్న తమ దేశీయుల నుంచే ఇంపోర్టెడ్ కేసులు ‘తలెత్తాయని’ అక్కడి ప్రభుత్వం పేర్కొంది.

ఇలా ఉండగా చైనా ప్రభుత్వం తమ దేశంలో నమోదైన కరోనా కేసుల గురించి, మృతుల గురించి ఎప్పుడూ ఒకే రీతిలో ప్రకటిస్తుండడంతో అనేక దేశాలు చైనా పట్ల అనుమానాలను వ్యక్తం చేశాయి. కరోనాకు సంబంధించిన సమాచారాన్ని తమతో పంచుకోలేదని ఆ దేశాన్ని తప్పు పట్టాయి. అయితే ఈ ఆరోపణలను చైనా ఖండిస్తూ.. ప్రపంచ ఆరోగ్య సంస్థతో సహా అన్ని దేశాలకూ తాము ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేస్తున్నామని పేర్కొంటూ వచ్చింది. ఇప్పుడీ తాజా వార్త పట్ల ప్రపంచ దేశాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.

సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
సలార్‌లో ప్రభాస్‌ బైక్‌ సొంతం చేసుకునే అవకాశం.. ఎలాగో తెలుసా.?
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
కుట్టుమిషిన్‌తో మొదలైన టైలర్‌ ప్రయాణం.. నేడు వేలకోట్లకు అధిపతి..!
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
పొలిటికల్ కమాండర్‎లా మారిన సీఎం రేవంత్.. ఢిల్లీ హైకమాండ్ సపోర్ట్‎
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
భారత్‌లో ఎయిర్‌ ట్యాక్సీలు వచ్చేది అప్పుడే.. ఇండిగో ప్రకటన
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు