AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనదేశంలో ఎంతమంది క్వారంటైన్‌లో ఉన్నారో తెలుసా ?

మే 14 నాటికి 11లక్షల 95 వేల మంది క్వారంటైన్ కేంద్రాలలో ఉండగా, 12 రోజుల్లోనే ఆ సంఖ్య దాదాపు రెట్టింపైనట్లు కేంద్రం పేర్కొంది. నాలుగో విడత లాక్‌డౌన్ సమయంలో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు దేశంలోపలే ప్రయాణించిన వారిని సైతం క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్లు కేంద్రం వెల్లడించింది.

మనదేశంలో ఎంతమంది క్వారంటైన్‌లో ఉన్నారో తెలుసా ?
Jyothi Gadda
|

Updated on: May 29, 2020 | 11:20 AM

Share

దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో, ఆయా ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో సుమారు 23 లక్షల మంది ఉన్నారని కేంద్రం ప్రకటించింది. నాలుగో విడత లాక్‌డౌన్ సమయంలో విదేశాల నుంచి వచ్చిన వారితో పాటు దేశంలోపలే ప్రయాణించిన వారిని సైతం క్వారంటైన్ కేంద్రాలకు తరలించినట్లు తెలిపింది. మే 26 నాటికి మొత్తంగా 22 లక్షల 81 వేలమందిని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచినట్లు వివరించింది.

మే 14 నాటికి 11లక్షల 95 వేల మంది క్వారంటైన్ కేంద్రాలలో ఉండగా, 12 రోజుల్లోనే ఆ సంఖ్య దాదాపు రెట్టింపైనట్లు కేంద్రం పేర్కొంది. మే 26 నాటికి మహారాష్ట్రలో 6 లక్షల 2 వేల మంది, గుజరాత్‌లో 4 లక్షల 42 వేల మంది క్వారంటైన్ కేంద్రాలలో ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఉత్తరప్రదేశ్‌లో 3 లక్షల 6 వేల మంది, బీహార్‌లో 2.1 లక్షల మంది, ఛత్తీస్‌గఢ్‌లో 1.86 లక్షలు, ఆంధ్రపదేశ్‌లో 14 వేల 930 మంది క్వారంటైన్‌లో ఉన్నట్లు పేర్కొంది. ఇతర ప్రాంతాల నుంచి తమ రాష్ట్రాల్లోకి వచ్చేవారిని కనీసం ఏడు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నాయి ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. ఇదివరకు 14 రోజులుగా ఉన్న క్వారంటైన్ కాలాన్ని ఇప్పుడు 7 రోజులకు కుదించారు.

గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
గాల్లోనే కుప్పకూలుతున్న పక్షులు.. రోజుకు100కుపైగా మృత్యువాత
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
‘మన శంకర వరప్రసాద్ గారు’.. చిరు, వెంకీ, నయన్‌ల రెమ్యునరేషన్స్ ఇవే
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
షట్టిల ఏకాదశినాడు చేసే ఈ తప్పులు శాపంగా మారవచ్చు! ఏం చేయాలంటే?
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
మన శంకర వర ప్రసాద్ సినిమాను మిస్ చేసుకున్న స్టార్ హీరో ఎవరో తెలుస
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
'ఒక్కపూట అన్నం పెట్టినందుకు.. నన్ను పెట్టి రూ. 3 కోట్ల సినిమా..
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వేలు విరగొట్టుకున్న స్టార్ ప్లేయర్.. షాక్ తిన్న ముంబై
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
వాషింగ్ మెషీన్‌లో ఉన్ని స్వెటర్‌ను ఎలా ఉతకాలి? సింపుల్ టిప్స్
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
కిడ్నీల్లో రాళ్లను పిప్పి పిప్పి చేసే దివ్యౌషధం..
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
ఇస్రో PSLV-C62 ప్రయోగం విఫలం.. 4వ దశలో కనిపించని రాకెట్‌ ఆచూకీ
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!
'ఆంటీ' అని పిలిస్తే అస్సలు ఊరుకోను.. వాళ్లు మాత్రమే.!