
దేశంలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ మహమ్మారి మరణ మృదంగం వాయిస్తోంది. అత్యధిక పాజిటివ్ కేసులు, మరణాలు ఈ రాష్ట్రంలోనే నమోదయ్యాయి. ఇక దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రజలు, వలస కూలీలు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.
ఇదిలా ఉంటే కరోనా పేషంట్లకు వైద్య సేవలు ఎలా అందుతున్నాయో తెలుసుకోవడానికి ఓ మేయర్ వినూత్న రీతిలో ఒక హాస్పిటట్‌ను సందర్శించారు. బీఎంసీ అధ్వర్యంలో వైద్య సేవలు అందిస్తున్న నాయర్ ఆసుపత్రికి ముంబై మేయర్ కిషోరి పెడ్నేకర్ నర్సు అవతారంలో వెళ్లారు. అక్కడ అన్నింటిని నిశితంగా పరిశీలించి.. కరోనా వైరస్ బారిన పడ్డవారిని కాపాడేందుకు కృషి చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బందిని ఆమె ప్రోత్సహించి.. సామాజిక దూరాన్ని ఖచ్చితంగా పాటించాలంటూ విజ్ఞప్తి చేశారు. ఇక దీనికి సంబంధించిన ఓ వీడియోను ఆమె తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
Read Also:
కరోనా వేళ.. మసీదులకు పోటెత్తారు.. మూల్యం చెల్లిస్తున్నారు..
హమ్మయ్య.. కిమ్ బ్రతికే ఉన్నాడు.. అవన్నీ వట్టి ఫేక్!
డబ్బు కావాలంటే సరిహద్దుల్లో చేసే దొంగచాటు పనులు ఆపండి..
‘పిల్లో ఛాలెంజ్’ కాదు భామలు.. ఫస్ట్ ఈమెను చూసి నేర్చుకోండి..
— Kishori Pednekar (@KishoriPednekar) April 27, 2020