AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ మరణించాడట.. అసలు దీనిలో నిజమెంత.!

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉందని.. చైనా నుంచి ప్రత్యేక వైద్య బృందం కూడా వెళ్ళిందన్న వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయనకు గుండె సంబంధిత ఆపరేషన్ జరిగిందని.. ఆ తర్వాత కోమాలోకి వెళ్ళాడని వదంతలు ఎన్నో వచ్చాయి. అయితే తాజాగా కిమ్ చనిపోయాడంటూ పుకార్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. #KIMJONGUNDEAD అనే హ్యాష్ ట్యాగ్ నిన్నటి నుంచి ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. […]

నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ మరణించాడట.. అసలు దీనిలో నిజమెంత.!
Ravi Kiran
|

Updated on: Apr 26, 2020 | 8:19 AM

Share

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితి విషయంగా ఉందని.. చైనా నుంచి ప్రత్యేక వైద్య బృందం కూడా వెళ్ళిందన్న వార్తలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయనకు గుండె సంబంధిత ఆపరేషన్ జరిగిందని.. ఆ తర్వాత కోమాలోకి వెళ్ళాడని వదంతలు ఎన్నో వచ్చాయి. అయితే తాజాగా కిమ్ చనిపోయాడంటూ పుకార్లు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వెల్లువెత్తాయి. #KIMJONGUNDEAD అనే హ్యాష్ ట్యాగ్ నిన్నటి నుంచి ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. హాంకాంగ్ శాటిలైట్ టెలివిజన్ (హెచ్‌కెఎస్‌టివి) వైస్ డైరెక్టర్ షిజియాన్ జింగ్‌జౌ మాట్లాడుతూ… తనకు ఉత్తర కొరియా నిరంకుశుడు కిమ్ జోంగ్(36) చనిపోయినట్లు తన వద్ద ఖచ్చితమైన సమాచారం ఉందంటూ చెప్పుకొచ్చారు. మరోవైపు ఓ జపనీస్ పత్రిక.. ‘కిమ్, ఈ నెల ప్రారంభంలో గుండెకు శస్త్ర చికిత్స చేయించుకున్నారని.. ఆయన ప్రస్తుతం కోమాలోకి వెళ్లిపోయారని పేర్కొంది.

ఇక ట్విట్టర్‌లో అయితే అనేక రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది బ్రెయిన్ డెడ్ అని చెబుతుంటే.. మరికొందరు కోమా అంటున్నారు. ఇదిలా ఉంటే ఉత్తర కొరియాకు చెందిన కహీవా అనే రిపోర్టర్ మాత్రం అక్కడ జరుగుతున్న పరిస్థితుల గురించి నిజాలు బయటపెట్టింది. ఇప్పటికే కిమ్ జోంగ్ ఉన్ చనిపోయారని, ఈ విషయాన్ని అక్కడి అధికారులు బయటికి రానివ్వడం లేదని చెప్పింది. అంతేకాకుండా కిమ్ స్థానంలో తన సోదరి కిమ్ యో జోంగ్ కూడా బాధ్యతలు చేపట్టారని తెలిపింది. అటు నియంతకు చెందిన 250 మీటర్ల పొడవైన రైలును వోన్సాన్ హాలిడే కాంపౌండ్ సమీపంలో ఉపగ్రహ ఫోటోలలో గుర్తించినట్లు న్యూస్ వెబ్‌సైట్ 38 నార్త్ తెలిపింది. కిమ్ ఆచూకీ తెలియకపోయినా, తూర్పు తీరంలోని ‘ఎలైట్’ ప్రాంతంలో కిమ్ కుటుంబానికి రిజర్వు చేయబడిన సమీప రైల్వే స్టేషన్ వద్ద రైలు ఉండటం.. ఆయన ఆ ప్రదేశానికి వెళ్ళినట్లు సూచిస్తోంది. ఏది ఏమైనా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై నార్త్ కొరియా ఇంకా అధికారికంగా స్పందించాల్సిన ఉంది.

ఇవి చదవండి:

మసీదులు తెరుస్తారా.? దేవుడి ఆగ్రహానికి గురవుతారా.?.. ఇమామ్‌ల అల్టిమేటం..

కరోనా ముస్లిం పేషంట్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..

కుటుంబంలో ఒక్కరికి మాత్రమే.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..

పంచాయతీ ఉద్యోగులకు తీపికబురు.. ఇకపై ప్రతీ నెలా రూ. 8500..