అర్థరాత్రి నుంచి ప్రారంభం కానున్న వలస కూలీలను తరలించే రైళ్లు

లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి వలస కూలీలను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 3 వేల మంది వలస కూలీలను లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి 3 ట్రైన్‌లలో వారి స్వస్థలాలకు పంపడానికి...

అర్థరాత్రి నుంచి ప్రారంభం కానున్న వలస కూలీలను తరలించే రైళ్లు

Edited By:

Updated on: May 06, 2020 | 12:43 PM

లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి వలస కూలీలను తరలించేందుకు ఏర్పాట్లు చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. దాదాపు 3 వేల మంది వలస కూలీలను లింగంపల్లి రైల్వే స్టేషన్ నుండి 3 ట్రైన్‌లలో వారి స్వస్థలాలకు పంపడానికి సిద్ధమయ్యింది. ఈరోజు అర్దరాత్రి రైళ్లు బయలుదేరనున్నాయి. ఇప్పటికే ఫ్లాట్ ఫార్మ్‌పై బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాయి మూడు రైళ్ళు. వైద్యుల పర్యవేక్షణలో వలస కూలీలను అన్ని టెస్టులు చేసిన తర్వాతే వారిని తరలించనున్నారు అధికారులు. ప్రత్యేకంగా వలస కూలీలను, వారి వాస్తువులను శానిటైజ్ చేశారు అధికారులు.

రైళ్ల వివరాలు..

– 12:15కు ధర్బంగా (బీహార్ రాష్ట్రం) వెళ్లనున్న ట్రైన్
-3 గంటలకు బాదల్ పూర్ (బీహార్ రాష్ట్రం) వెళ్లనున్న ట్రైన్
-4 గంటలకు బోలక్ పూర్ (ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం) వెళ్లనున్న ట్రైన్

Read More:

బ్రేకింగ్: లాక్‌డౌన్ పొడిగించిన సీఎం కేసీఆర్.. ఎప్పటివరకూ అంటే?

బ్రేకింగ్: దేశవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలను రద్దు చేసిన కేంద్రం

బ్రాహ్ముణులను కించపరిచిందని.. యాంకర్ శ్రీముఖిపై పోలీస్ కేసు..

ఉదయ్ కిరణ్‌ చావుకు ఆ అగ్ర హీరోకి సంబంధం లేదు.. తేల్చిచెప్పిన తేజ!