Lock down: కరోమా మహమ్మారి దేశాన్ని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. రోజురోజుకీ పెరుగుతోన్న కేసులే దీనికి సాక్ష్యంగా చెప్పవచ్చు. ఫస్ట్ వేవ్ సమయంలో కేసుల సంఖ్య కాస్త కంట్రోల్‌లో ఉంటే సెకండ్ వేవ్ సమయానికి వచ్చేసరికి ఇది ఉప్పెనలా మారింది. దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కరోనా విలయతాండవమే కనిపిస్తోంది. ఆక్సిజన్ అందక కొందరు, ఆసుపత్రుల్లో బెడ్స్ దొరకగా మరికొందరు పిట్టల్లా రాలిపోతున్నారు.
అయితే ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయాలంటే దేశ వ్యాప్తంగా మళ్లీ లాక్‌డౌన్ విధించడమే మార్గమనే వాదనకు బలం పెరుగుతోంది. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే ఈ దిశలో అడుగులు కూడా వేస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా లాక్‌డౌన్‌పై ప్రకటన చేస్తుందని అందరూ భావించారు. కానీ అలాంటి ప్రకటన ఏది రాలేదు. దీంతో తాజాగా లాక్‌డౌన్ విధించాలని చాలా మంది సూచిస్తున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల అఖిల భారత వర్తక సమాఖ్య (సీఏఐటీ) చేపట్టిన ఆన్ లైన్ సర్వేలో 67 శాతం మంది లాక్‌డౌన్ అమలు చేయాలని కోరడం విశేషం. కరోనాను కట్టడి చేయడానికి తక్షణమే లాక్‌డౌన్ అమలు చేయాలని సీఏఐటీ జాతీయ అధ్యక్షుడు ప్రవీణ్ ఖండేల్వాల్.. ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ణప్తి చేశారు. వైరస్ చైన్ ను బ్రేక్ చేసేందుకు దేశవ్యాప్త లాక్‌డౌన్ సాధ్యం కాని పక్షంలో కొవిడ్-19 కేసులు అత్యధికంగా వెలుగు చూస్తున్న రాష్ట్రాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించాలని కోరారు. ఈ క్రమంలోనే సీఏఐటీ చేపట్టిన సర్వేలో 9000 మందికి పైగా పాల్గొన్నాగా.. వీరిలో 67.5 శాతం మంది కరోనా కట్టడికి దేశవ్యాప్త లాక్‌డౌన్ కు మొగ్గుచూపారని చెప్పారు. ఇదిలా ఉంటే కరోనా సెకండ్ వేవ్ నియంత్రించలేని విధంగా మారిందని 78.2 శాతం మంది అభిప్రాయపడ్డారు.
మరో మహమ్మారి ప్రబలే అవకాశం..! సంచలన విషయం చెప్పిన శాస్త్రవేత్తలు.!! అసలేంటంటే.?