AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎమ్మెల్యే ఇంట్లో కరోనా కలకలం.. మొత్తం నలుగురికి..!

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,546కు చేరింది.

ఎమ్మెల్యే ఇంట్లో కరోనా కలకలం.. మొత్తం నలుగురికి..!
TV9 Telugu Digital Desk
|

Updated on: May 29, 2020 | 12:19 PM

Share

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59,546కు చేరింది. తాజాగా ఆ రాష్ట్రంలోని డియోలాలి ఎన్పీపీ ఎమ్మెల్యే సరోజ్ అహోరి ఇంట్లో కరోనా కలకలం రేపింది. సరోజ్ ఇంట్లో మొత్తం నలుగురు కరోనా బారిన పడ్డారు. ఈ విషయంపై సరోజ్‌ మాట్లాడుతూ.. ”మా ఇంట్లోని ముగ్గురు కుటుంబ సభ్యులతో పాటు నాకు కూడా కరోనా సోకింది” అని అన్నారు. ఇటీవల సరోజ్ కుటుంబం అంత్యక్రియల్లో పాల్గొనగా.. అక్కడే వైరస్ సోకినట్లు సమాచారం.

కాగా మహారాష్ట్రలో ఇప్పటివరకు ముగ్గురు ఎమ్మెల్యేలకు ఈ వైరస్‌ సోకింది. ఎన్సీపీ ఎమ్మెల్యే, హౌసింగ్ మినిస్టర్‌ జితేంద్ర అవ్హద్‌కి కరోనా రాగా.. ఆయన ఇటీవలే కోలుకున్నారు. ఇక మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే, పీడబ్ల్యూడీ మంత్రి అశోక్‌ చవాన్‌ కరోనా బారిన పడగా.. ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో ఇప్పటివరకు 4.19లక్షల పరీక్షలు జరిగాయి. అందులో 59,546 పాజిటివ్ కేసులుగా నిర్ధారణ కాగా.. ప్రస్తుతం 35,122 యాక్టివ్ కేసులున్నాయి. 85 మంది ఈ వ్యాధిలో మృత్యువాతపడ్డారు. మహారాష్ట్రలో 6.12లక్షల మంది హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు. ఒక్క ముంబయి నగరంలోనే 35,485 కేసులున్నాయి.

Read This Story Also: కరోనా అప్‌డేట్స్‌: 58లక్షలు దాటేసిన కేసులు.. తొమ్మిదో స్థానంలో భారత్..!

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే